Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
50% పడిపోయిన వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే!

50% పడిపోయిన వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే!

వార్త 1 week ago

Silver Price Crash: ప్రపంచ బులియన్ మార్కెట్‌లో ప్రసిద్ధ లోహాలైన బంగారం మరియు వెండి ధరల ప్రతికూల కదలికలు ట్రేడర్లను, ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర దాదాపు 3% తగ్గగా, వెండి ధర మాత్రం ఏకంగా 16% పైగా పతనమైంది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో నమోదైన ఆల్ టైమ్ గరిష్ట (All-Time High) ధర 121.64 డాలర్లతో పోలిస్తే, ప్రస్తుతం వెండి రేటు ఏకంగా 50% పైగా పడిపోవడం పెట్టుబడిదారులలో సంచలనంగా మారింది.

 Silver prices have dropped by 50%… Here are the main reasons!

Silver Price Crash: వెండి ధరల పతనానికి అసలు కారణాలివే..

వెండి ధరలు భారీగా పడిపోవడానికి దాని ద్వంద్వ స్వభావమే ఒక ముఖ్యమైన కారణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. వెండి ఆభరణాల తయారీకి, పెట్టుబడులకు ఉపయోగపడే విలువైన లోహం మాత్రమే కాదు.. పారిశ్రామిక అవసరాలకూ కీలకమైన ముడి పదార్థం. అందువల్ల ఆర్థిక పరిస్థితులతో పాటు పరిశ్రమల డిమాండ్‌లో వచ్చే మార్పులు కూడా వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

పెట్టుబడి పరంగా చూస్తే.. బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ బలోపేతం కావడం వంటి పరిణామాలు వెండిలో పెట్టుబడులపై ఆసక్తిని తగ్గించి ధరలపై ఒత్తిడి పెంచవచ్చు. పారిశ్రామిక డిమాండ్ విషయానికొస్తే.. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండిని విస్తృతంగా వినియోగిస్తారు. చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో తయారీ రంగం మందగిస్తే వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో పెట్టుబడుల నుంచి వచ్చే ఒత్తిడికి పారిశ్రామిక డిమాండ్ తగ్గుదల కూడా తోడైతే వెండి ధరలు మరింత దిగజారవచ్చు.

ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏమి చేయాలి?

బంగారంతో పోలిస్తే వెండిలో హెచ్చుతగ్గులు (Volatility) చాలా వేగంగా, ఎక్కువగా ఉంటాయి. పెరిగేటప్పుడు ఎంత వేగంగా పెరుగుతుందో, తగ్గడం ప్రారంభమైనప్పుడు అంతే వేగంగా పడిపోతుంది. అందువల్ల దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఒకేసారి కాకుండా సిస్టమాటిక్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టడం మంచిదని, స్వల్పకాలిక ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం ప్రియులకు షాక్.. నేడు మళ్లీ పెరిగిన పసిడి ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha