Gold rate: గత కొద్ది రోజుల నుంచి భారీగా పతనమవుతూ వచ్చిన ధరలు.. నిన్న కాస్త పుంజుకుని పెట్టుబడిదారులను నష్టాల నుండి బయటపడేశాయి. అయితే, సామాన్యులకు మాత్రం బంగారం ధరలు పెరగడం కొనుగోలును మరింత భారంగా మారుస్తోంది.
తాజాగా ఈరోజు (అక్టోబర్ 10, శనివారం) దేశీయ మార్కెట్లోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు మళ్లీ కాస్త పెరిగాయి.
Read Also : Toor Dal Prices Hike: భారీగా పెరిగిన కందిపప్పు ధరలు
A shock for gold lovers… gold prices have risen again today.
Gold rate: దేశవ్యాప్తంగా నేటి బంగారం ధరలు (గ్రాముకు)
- 24 క్యారట్ల బంగారం: గ్రాముకు రూ.71 పెరిగి రూ.15,142 వద్ద ట్రేడ్ అవుతోంది. (100 గ్రాములు: రూ.15,14,200)
- 22 క్యారట్ల బంగారం: గ్రాముకు రూ.65 పెరిగి రూ.13,880 వద్ద ట్రేడ్ అవుతోంది. (100 గ్రాములు: రూ.13,88,000)
- 18 క్యారట్ల బంగారం: గ్రాముకు రూ.54 పెరిగి రూ.11,357 వద్ద ట్రేడ్ అవుతోంది. (100 గ్రాములు: రూ.11,35,700)
ప్రముఖ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, బెంగళూరు, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,800గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,13,570గా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,570 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,950గా ఉంది. అహ్మదాబాద్‌లో ఈ ధరలు వరుసగా రూ.1,51,470, రూ.1,38,850గా ఉన్నాయి. చెన్నైలో 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,000గా ఉంది.
ఫోన్ కొనేవారికి గుడ్‌న్యూస్.. SBI కార్డులతో అదనపు డిస్కౌంట్లు

