Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
540 రోజుల పిరియడ్ రద్దు చేసిన ట్రంప్ సర్కారు

540 రోజుల పిరియడ్ రద్దు చేసిన ట్రంప్ సర్కారు

వార్త 1 week ago

H-1B Visa : అమెరికాలో ఉపాధి అనుమతి పత్రాల (EAD) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది వలసదారులకు.. ముఖ్యంగా భారతీయ IT రంగానికి చెందిన H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు (H-4 వీసా హోల్డర్లు) బిగ్ షాక్ తగిలింది.

పెండింగ్‌లో ఉన్న వర్క్ పర్మిట్ దరఖాస్తుదారులకు లభించే 540 రోజుల ‘ఆటోమేటిక్ పొడిగింపు’ (Automatic Extension) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) తుది నిబంధనలను జారీ చేసింది. అక్టోబర్ 14, 2026న ఫెడరల్ రిజిస్టర్‌లో ఇది ప్రచురితమైన వెంటనే అమల్లోకి వస్తుందని బ్లూమ్‌బెర్గ్ లా నివేదించింది. దీంతో అక్టోబర్ 2025లో ట్రంప్ పరిపాలన ప్రవేశపెట్టిన తాత్కాలిక నిబంధన ఇప్పుడు శాశ్వత చట్టంగా మారింది.

Food Waste : ఆహార వృథాను నివారిస్తేనే సమాజ ప్రగతి

 H-1B Visa

H-1B Visa : ‘ఆటోమేటిక్ పొడిగింపు’ అంటే ఏమిటి?

అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులు (ఉదాహరణకు H-4 వీసాదారులు, ఆశ్రయం కోరేవారు మొదలైనవారు) తమ వర్క్ పర్మిట్ లేదా EAD (Employment Authorization Document) గడువు ముగియబోతున్నప్పుడు దాన్ని రెన్యువల్ (Renewal) కోసం దరఖాస్తు చేసుకుంటారు. గతంలో ఇమ్మిగ్రేషన్ విభాగం (USCIS) ఈ దరఖాస్తులను ప్రాసెస్ చేసి కొత్త EAD కార్డు ఇచ్చే వరకు చాలా నెలల సమయం పట్టేది. ఆ జాప్యం వల్ల ఉద్యోగులు పాత పర్మిట్ గడువు ముగిసి ఉద్యోగాలు కోల్పోకుండా ఉండేందుకు.. బైడెన్ ప్రభుత్వం ఒక వెసులుబాటు తెచ్చింది. దానిప్రకారమే 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు వచ్చింది. ఒకసారి వర్క్ పర్మిట్ రెన్యూవల్ అప్లికేషన్ సబ్‌మిట్ చేయగానే, పాత EAD కార్డు గడువు ముగిసినప్పటికీ, అధికారులు నిర్ణయం తీసుకునే వరకు ఆటోమేటిక్‌గా 540 రోజుల పాటు (దాదాపు 18 నెలలు) పాత పర్మిట్‌పైనే అమెరికాలో ఉద్యోగం కొనసాగించే చట్టబద్ధమైన హక్కు లభించేది. దీనివల్ల USCIS అధికారుల ప్రాసెసింగ్ ఎంత ఆలస్యమైనా (కార్డు రావడానికి నెలల సమయం పట్టినా), ఉద్యోగికి జీతం లేదా ఉద్యోగంలో ఎటువంటి ఆటంకం (Gap) వచ్చేది కాదు. తాజాగా ట్రంప్ ప్రభుత్వం ఈ 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను పూర్తిగా రద్దు చేసి చట్టాన్ని శాశ్వతం చేసింది. ఇకపై EAD రెన్యూవల్ అప్లై చేసినంత మాత్రాన పాత కార్డుకు 540 రోజుల గడువు పొడిగింపు లభించదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

భాగ్యనగరానికి నీటి కష్టాలు తప్పవా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha