Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన!

వార్త 1 week ago

Puttaparthi AMCA: ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదికగా భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఏఎమ్‌సీఏ ( AMCA - Advanced Medium Combat Aircraft) 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ కు పుట్టపర్తిలో ఘనంగా శంకుస్థాపన జరిగింది.

ఈ మెగా ప్రాజెక్ట్ వెనుకబడిన రాయలసీమ ప్రాంతపు భవిష్యత్తును సంపూర్ణంగా మార్చేయబోతోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ మంత్రి సమక్షంలో శంకుస్థాపన

శుక్రవారం నాడు వైభవంగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాయలసీమకు పారిశ్రామిక వేగాన్నిచ్చే మెగా ప్రాజెక్ట్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ, భారత రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి పుట్టపర్తి వేదిక కావడం యావత్ ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన "మేక్ ఇన్ ఇండియా" (Make in India) లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. దీని ద్వారా రాయలసీమ ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యా మరియు సాంకేతిక రంగాలు మునుపెన్నడూ లేని విధంగా వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Puttaparthi AMCA: యువతకు భారీగా ఉపాధి అవకాశాలు

ఈ 5th Generation ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ నిరుద్యోగ యువతకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విభాగాల్లో విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పానికి ఈ కేంద్రం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పరిశ్రమల వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని, అందులో భాగమే రాయలసీమకు ఈ భారీ ప్రాజెక్ట్ రాక అని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో రాయలసీమకు గ్లోబల్ మ్యాప్‌లో ప్రత్యేక గుర్తింపు లభించనుందని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భోగాపురం విమానాశ్రయం.. 99.3% పనులు పూర్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha