Police Jobs : తెలంగాణలో కొలువుల జాతర షురూ అయింది. రాష్ట్రంలోని నిరుద్యోగులు, పోలీస్ ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5,000 పోలీసు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తాజా ఉత్తర్వులతో శాంతిభద్రతల పరిరక్షణ మరింత బలోపేతం కానుంది. ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా వేలాది మంది యువతకు ఖాకీ యూనిఫాం వేసుకోవాలనే కల నెరవేరబోతోంది. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేసుకుంటున్నారు.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు - త్వరలోనే నోటిఫికేషన్
ఆర్థిక శాఖ అనుమతి పొందిన ఈ 5,000 పోస్టులలో అత్యధికంగా సివిల్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్ఐ (CIVIL) – 148, కానిస్టేబుల్ (CIVIL) – 3,697, మరియు కానిస్టేబుల్ (AR) – 1,052 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు ఎస్ఐ ఆర్ముడ్ రిజర్వ్ (14), ఆర్‌ఎస్‌ఐ టీజీపీఎస్సీ (12), ఎస్ఐ ఏఆర్ సివిల్ (3), ఏఎస్ఐ ఎఫ్‌పీబీ (23), కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సీపీఎల్ (24), డ్రైవర్ పీటీవో (20), మెకానిక్ పీటీవో (7) పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSPLRB) ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయడానికి కసరత్తు చేస్తోంది.
గ్రామాల్లో నాలుగు రకాల చెత్త సేకరణ తప్పనిసరి.. సీఈవో ఎల్లయ్య

