Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రామాల్లో నాలుగు రకాల చెత్త సేకరణ తప్పనిసరి.. సీఈవో ఎల్లయ్య

గ్రామాల్లో నాలుగు రకాల చెత్త సేకరణ తప్పనిసరి.. సీఈవో ఎల్లయ్య

వార్త 3 weeks ago

Medak waste collection: గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు వర్షాకాలంలో ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య సూచించారు.

ఘన వ్యర్థాల నిర్వహణ, వనమహోత్సవం, వర్షాకాల సన్నద్ధత తో పాటు వర్షాకాలంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీ కార్యదర్శులు , ఫీల్డ్ అసిస్టెంట్లు తో శుక్రవారం నాడు మండల పరిషత్ సమావేశ మందిరంలోనిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read Also: TG debts calculation: బీఆర్ఎస్ హయాంలో రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. భట్టి విక్రమార్క సంచలనం!

 Segregation of waste into four categories is mandatory in villages: CEO Yellayya.

Medak waste collection: ఇంటింటికీ అవగాహన, నాలుగు రకాల చెత్త వేరు చేసే విధానం

ప్రతి గ్రామంలో తప్పనిసరిగా నాలుగు రకాల చెత్త సేకరణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఇంటింటికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డోర్-టు-డోర్ స్టిక్కర్ల పంపిణీ, అతికింపు కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు ఆదర్శంగా ముందుగా సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఇళ్లలోనే నాలుగు రకాల చెత్త వేరు చేసే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.వనమహోత్సవ కార్యక్రమాలను వేగవంతం చేసి విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వర్షాకాల ముందస్తు చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మాన్సూన్ ప్రిపేర్డ్‌నెస్ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సీఈఓ ఆదేశించారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, ఎక్కడా వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవడం, దోమల నివారణ కార్యక్రమాలను ముమ్మరం చేయడం, తాగునీటి పరిశుభ్రతను నిర్ధారించడం, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో క్రాంతి కుమార్, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, ఏపీఓ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha