Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
60 రోజుల స్టాక్ ఉంది.. కేంద్రం సంచలన ప్రకటన

60 రోజుల స్టాక్ ఉంది.. కేంద్రం సంచలన ప్రకటన

వార్త 3 months ago

Petrol Diesel Shortage : దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది.

ఇంధన నిల్వలు సరిపడానే

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ప్రస్తుతం 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యూహాత్మక నిల్వలను కలుపుకుంటే మొత్తం 74 రోజులకు సరిపడా ముడి చమురు అందుబాటులో ఉందని వెల్లడించింది.

పానిక్ బయ్యింగ్ వల్లే క్యూలు

ఇంధన కొరత ఉందన్న రూమర్ల కారణంగా ప్రజలు పెట్రోల్ బంకులకు పెద్ద ఎత్తున వెళ్లడం వల్ల క్యూలు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, దేశవ్యాప్తంగా రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Read Also:Jeevan Reddy on Jagan: జగన్ పట్ల వివక్ష వల్లే కాంగ్రెస్ పతనం

 Petrol Diesel Shortage

ఫేక్ న్యూస్‌పై కఠిన చర్యలు

సోషల్ మీడియాలో ఇంధన కొరతపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజలు అవసరమైనంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha