Sumit Satish Rastogi: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న సుమిత్ సతీష్ రస్తోగి (39) అనే భారతీయ పౌరుడికి అడిలైడ్ స్థానిక కోర్టు దాదాపు 14 ఏళ్ల (13 ఏళ్ల 10 నెలలు) జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
అడిలైడ్‌లోని ఒక మసాజ్ పార్లర్‌లో థెరపిస్ట్‌గా పనిచేసే రస్తోగి, అక్కడికి వచ్చే మహిళా వినియోగదారులను టార్గెట్ చేశాడు. అక్టోబర్ 2021 నుండి జులై 2022 మధ్య కాలంలో మసాజ్ నెపంతో సుమారు 61 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా, బాధితులకు తెలియకుండా వారిని రహస్యంగా వీడియోలు తీసి డిజిటల్ నేరాలకు ఒడిగట్టాడు. ఈ దారుణ ఉదంతంపై సుదీర్ఘంగా సాగిన విచారణలో నిందితుడిపై ఉన్న 97 ఆరోపణలు నిజమని రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
Read Also :Jadcherla Vaishnavi Murder: ప్రేమకు ఒప్పుకోలేదని యువతిపై దారుణం
Sumit Satish Rastogi:మసాజ్ పార్లర్‌లో కిరాతకం
విచారణ సందర్భంగా నిందితుడికి మానసిక రుగ్మతలు ఉన్నాయని రక్షణ పక్షం వాదించినప్పటికీ, న్యాయమూర్తి ఆ వాదనలను తోసిపుచ్చారు. మానసిక స్థితి సరిగ్గా లేదనే నెపంతో ఇంతటి భయంకరమైన నేరాలను సమర్థించలేమని, బాధితులకు జరిగిన అన్యాయానికి కఠిన శిక్ష పడాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రకారం సుమిత్ రస్తోగి ఆస్ట్రేలియా జైలులో తన శిక్షా కాలాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను ఆస్ట్రేలియాలో ఉండే అర్హతను పూర్తిగా కోల్పోతాడని, జైలు నుండి విడుదలైన వెంటనే అతడిని ఆస్ట్రేలియా వీసా రద్దు చేసి దేశం నుండి శాశ్వతంగా బహిష్కరిస్తామని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

