Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి

బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి

వార్త 3 months ago

Bangkok Train Crash: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో శనివారం సాయంత్రం ఊహించని రీతిలో జరిగిన ఒక భయంకర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

నగర కేంద్రంలోని ఓ ఎయిర్‌పోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న క్రాసింగ్ వద్ద వాహనాలు నిలిచి ఉన్న సమయంలో, వేగంగా వచ్చిన గూడ్స్ రైలు ఒక ప్యాసింజర్ బస్సును నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు పట్టాలపై కొంతదూరం ఈడ్చుకెళ్లబడడమే కాకుండా, వెంటనే భారీగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదంలో పక్కనే ఉన్న పలు మోటార్ సైకిళ్లు, కార్లు కూడా దెబ్బతిన్నాయి.

Read Also :Hamas Commander Killed: ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడి.. హమాస్ మిలిటరీ విభాగం అధిపతి హద్దాద్ దుర్మరణం!

Bangkok Train Crash: రైల్వే గేట్ పడకపోవడమే శాపమైందా?

ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ (ఎరావాన్ మెడికల్ సెంటర్) మరియు రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. థాయ్‌లాండ్ రవాణా శాఖ సహాయ మంత్రి సిరిపాంగ్ అంగ్కాసకుల్కియాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతదేహాలన్నీ బస్సు లోపలి నుంచే స్వాధీనం చేసుకున్నట్లు మీడియాకు తెలిపారు. అయితే, రైలు వచ్చే సమయంలో వాహనాలను ఆపడానికి వేసే రైల్వే గేట్లు (బారియర్స్) సరిగ్గా కిందకు దిగలేదని, అందుకే బస్సు పట్టాలపైనే ఆగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రక్షణ లోపాలపై స్పందించిన మంత్రి, దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని, దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha