Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
85.25 శాతంతో అదరగొట్టిన విద్యార్థులు - చంద్రబాబు అభినందనలు

85.25 శాతంతో అదరగొట్టిన విద్యార్థులు - చంద్రబాబు అభినందనలు

వార్త 1 month ago

AP 10th Class Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఉత్తీర్ణత సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేసిన హర్షం, విద్యాశాఖలో వస్తున్న సానుకూల మార్పులకు అద్దం పడుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు పెరగడం గమనార్హం. పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

Read Also:AP 10th Supplementary Exams: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల.. ఫీజు వివరాలు ఇవే!

 CM Chandrababu on AP 10th Results 2026

AP 10th Class Results: ముఖ్యమంత్రి ప్రకటనలోని ముఖ్యాంశాలు

గత ఏడాది ఇది కేవలం 81.1 శాతంగా మాత్రమే ఉందని గుర్తుచేశారు. బాలురతో పోలిస్తే బాలికలు 5.22 శాతం అధిక ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు మెరుగుపడటాన్ని ఆయన ప్రస్తావించారు. గతేడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ బడుల ఉత్తీర్ణత, ఈసారి 78.39 శాతానికి పెరగడం స్ఫూర్తిదాయకమని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

6వ తరగతిలో ఆగిపోయిన చదువు.. ఇప్పుడు కొడుకుతో కలిసి టెన్త్ పాసైన తల్లి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha