Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
6వ తరగతిలో ఆగిపోయిన చదువు.. ఇప్పుడు కొడుకుతో కలిసి టెన్త్ పాసైన తల్లి!

6వ తరగతిలో ఆగిపోయిన చదువు.. ఇప్పుడు కొడుకుతో కలిసి టెన్త్ పాసైన తల్లి!

వార్త 1 month ago

AP 10th Results: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీలహరి చిన్నప్పుడే చదువు ఆపేశారు. ఆరో తరగతితోనే విద్యాభ్యాసం ఆగిపోయినా ఆమెలో చదవాలనే పట్టుదల తగ్గలేదు.

తన కొడుకు విజయ్ తో పాటు ఎలాగైనా టెన్త్ పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు రాసేందుకు సిద్ధమై అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Read also: AP Politics: అమరావతి పనులా లేక ప్రజల కష్టాలా?: షర్మిల

 Mother son celebrate 10th exam success

AP 10th Results: సత్తా చాటిన తల్లీకొడుకులు

ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఈ తల్లీకొడుకులు అదరగొట్టారు. కొడుకు విజయ్ రెగ్యులర్ స్కూల్ ద్వారా 562 మార్కులు సాధించగా.. తల్లి లక్ష్మీలహరి ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 360 మార్కులతో పాస్ అయ్యారు. ఎన్నో ఏళ్ల గ్యాప్ వచ్చినా పట్టువదలకుండా పుస్తకం పట్టి విజయం సాధించిన లక్ష్మీలహరిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంతోషంలో మునిగిపోయిన కుటుంబం

రిజల్ట్స్ చూసుకున్న ఆ తల్లీకొడుకులు సంతోషంతో గంతులు వేశారు. ఒకేసారి ఇద్దరూ పాస్ కావడంతో ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఈ తల్లి నిరూపించారు. చుట్టుపక్కల వారు, బంధువులు ఆ తల్లి ధైర్యాన్ని, ఆ పట్టుదలను మెచ్చుకుంటూ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ క్యాబినెట్ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha