Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి.. మంత్రి తుమ్మల

ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి.. మంత్రి తుమ్మల

వార్త 2 months ago

కేంద్ర హోం మంత్రి అమిత్ కు మంత్రి తుమ్మల లేఖ

Telangana: రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్లోని 5 గ్రామా లను తెలంగాణలో కలిపే అంశం మరోసారి చర్చనీయాశంగా మారింది.

ఈ అంశంపై తాజాగా ఆదివారం కేంద్ర హోంశాఖ మం త్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రా చలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరారు.

Read Also: Markapuram crime: 'నాన్న జాగ్రత్త' అని రాసి టీచర్ ఆత్మహత్య

 Merge those 5 villages into Telangana.. Minister Thummala’s letter.

Telangana: రాజ్యసభలో రేణుకా చౌదరి ప్రస్తావన

పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలని, దాంతో ద్వారా గిరిజనులు ఎదుర్కొంటు న్న సమస్యలు చాలావరకు తొల గిపోతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే విలీన బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని కోరారు. ఇప్పటికే ఈ సమస్యను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సిఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారని లేఖలో పేర్కొన్నారు. గత గురువారం ఏపీ రాజధాని అమరావతి చట్టబద్దత బిల్లుపైన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా భద్రాచలం అయిదు గ్రామాలు తెలంగాణకే ఇవ్వాలని రాజ్యసభ ఎంపి రేణుకా చౌదరి కేంద్రాన్ని కోరారు. ఆ అయిదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని, తెలంగాణలో ఉండాలనుకునే వాళ్లను ఏపీలో కలిపారన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రామయంపేట్ నియోజకవర్గం ఏర్పాటు కోసం ఎంపీ కి వినతిపత్రం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha