Vignesh Shivan about Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నయనతార-విఘ్నేష్ శివన్ దంపతుల మధ్య నడుస్తున్న సుదీర్ఘ వివాదంపై దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) ప్రమోషన్స్‌లో భాగంగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ధనుష్‌పై తనకున్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు.
Read Also:Meghamsh Srihari: మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ప్రారంభం
భావోద్వేగపూరిత వ్యాఖ్యలు
ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (తెలుగులో ఏప్రిల్ 10న విడుదల) ప్రమోషన్లలో విఘ్నేష్ శివన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. "ధనుష్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. జూలై 28 ఆయన పుట్టినరోజు.. అదే రోజు మా నాన్న చనిపోయారు. అందుకే ధనుష్ సార్ లో నేను నా తండ్రిని చూసుకుంటాను" అని విఘ్నేష్ అన్నారు. తను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి 100 శాతం ధనుష్ కారణమని, 'VIP' సినిమా సమయంలో రెండేళ్లపాటు ఆయన నీడలోనే పెరిగానని గుర్తుచేసుకున్నారు."ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మా మధ్య అంతటి అనుబంధం ఉండేది. అది కోల్పోయినందుకు నాకు సిగ్గుగా, రిగ్రెట్ గా అనిపిస్తుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Vignesh Shivan comments on Dhanush
వివాదం నేపథ్యం
ఈ బంధం 2024లో తలెత్తిన వివాదంతో దెబ్బతింది. నయనతార(nayanthara) రిలీజ్ చేసిన ఓపెన్ లెటర్ తర్వాత ఈ అంశం పబ్లిక్ చర్చకు వచ్చింది. నానుమ్ రౌడీ దాన్(Nanum Rowdy Dhaan) సినిమాకు సంబంధించిన కాపీరైట్ సమస్య ఈ విభేదాలకు కేంద్రంగా మారింది. ధనుష్ లీగల్ మార్గాన్ని ఎంచుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ప్రస్తుతం ముగ్గురూ తమ తమ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నప్పటికీ, ఈ విభేదాలు భవిష్యత్తులో సర్దుబాటుకు దారితీస్తాయా అన్నది పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

