Dailyhunt
ఆ చేదు జ్ఞాపకాన్ని హర్భజన్ అమ్ముకున్నాడు: శ్రీశాంత్

ఆ చేదు జ్ఞాపకాన్ని హర్భజన్ అమ్ముకున్నాడు: శ్రీశాంత్

వార్త 1 week ago

Harbhajan Singh vs Sreesanth: 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్‌ను కొట్టిన ఘటన 'స్లాప్‌గేట్' వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీశాంత్, హర్భజన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆనాటి ఘటనను హర్భజన్ తన స్వార్థం కోసం, వాణిజ్య ప్రకటనల ద్వారా కోట్లు సంపాదించడానికి వాడుకున్నారని శ్రీశాంత్ మండిపడ్డారు. ఈ వ్యవహారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిందిశ్రీశాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్భజన్ సింగ్ ఆనాటి చెంపదెబ్బ ఘటన ఆధారంగా ఒక వాణిజ్య ప్రకటన (AD)లో నటించి దాదాపు కోటి రూపాయలు సంపాదించారు.

Read Also: IPL : IPLలో సరికొత్త రికార్డులు సృష్టించిన కోహ్లి

కోటి రూపాయల ప్రకటన.. అదే కొంపముంచింది!

శ్రీశాంత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్భజన్ సింగ్ ఆనాటి చెంపదెబ్బ ఘటన ఆధారంగా ఒక వాణిజ్య ప్రకటన (AD)లో నటించి దాదాపు కోటి రూపాయలు సంపాదించారు.దానిని నుంచి దాదాపుగా రూ.80 లక్షల నుంచి కోటి దాకా సంపాదించాడు.అంతేకాదు.. నాకు ఫోన్ చేసి ఆ యాడ్ గురించి ఇన్స్టా స్టోరీలో పెట్టమని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘నేను నిన్ను క్షమిస్తాను.. కానీ ఆ ఘటనను ఎన్నటికీ మర్చిపోను’ అని భజ్జికి సమాధానం ఇచ్చాను.మన పట్ల ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే వారిని క్షమించవచ్చు.

 Sreesanth Latest Interview

Harbhajan Singh vs Sreesanth: సానుభూతి కోసమే ఆ మాటలు.. శ్రీశాంత్ ఫైర్

కానీ ఆ తప్పును క్షమించకూడదు. లేదంటే వాళ్లు తిరిగి అదే పునరావృతం చేస్తారు. ఇందుకు భజ్జీ మంచి ఉదాహరణ అని చెప్పడానికి నేను సందేహించను.ఇటీవలి కాలంలో హర్భజన్ పలు ఇంటర్వ్యూలలో, ఆనాడు శ్రీశాంత్‌ను కొట్టి తప్పు చేశానని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని శ్రీశాంత్ విమర్శించారు. “ఇంటర్వ్యూలలో అతను చెప్పే మాటలన్నీ నటనేనని నాకు అర్థమైంది. ఆ యాడ్ చూసిన తర్వాతే హర్భజన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాను. ఆ ప్రకటనతో మా మధ్య ఉన్న కొద్దిపాటి బంధం కూడా తెగిపోయింది” అని శ్రీశాంత్ స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఫామ్ కోల్పోయిన స్టార్ కెప్టెన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha