Mosquito sticks side effects: మీరు ఇంట్లో దోమల బెడద తట్టుకోలేక రకరకాల మందులు, కాయిల్స్, అగరుబత్తులు వాడుతున్నారా? దోమలను తరిమికొట్టే ఈ ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నాయని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మార్కెట్లో దొరికే కొన్ని రకాల దోమల అగరుబత్తుల వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ప్రమాదకరమైన గురించి హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) తాజాగా ఒక సర్వే నిర్వహించి కీలక విషయాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఐఆర్ (CIR – సెంట్రల్ ఇన్సెక్టిసైడ్స్ రిజిస్ట్రేషన్) నంబర్ లేని లోకల్ బ్రాండ్ ఉత్పత్తులను అస్సలు కొనవద్దని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
Read also: BP control tips: మందుల్లేకుండా బీపీ కంట్రోల్.. ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే అస్సలు వదలరు!
Mosquito Repellent Sticks Danger
Mosquito sticks side effects: సర్వేలో తేలిన నమ్మలేని చేదు నిజాలు
దేశవ్యాప్తంగా దాదాపు 12 నగరాల్లో 1264 కుటుంబాలు, 405 మంది ప్రముఖ వైద్యులతో ఈ సర్వే చేశారు. అనధికారిక దోమల నివారణ మందుల పొగ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయని 70 శాతం మంది డాక్టర్లు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారుచేసే కొన్ని అగరుబత్తుల పొగ సిగరెట్ పొగతో సమానమని 67 శాతం మంది వైద్యులు తేల్చి చెప్పారు. అందుకే ప్యాకెట్ మీద సీఐఆర్ రిజిస్ట్రేషన్ గుర్తింపు లేని ఏ ఒక్క ప్రొడక్ట్‌ను కూడా ఇళ్లలో వెలిగించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ పొగ వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు
- ఊపిరి పీల్చుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది రావడం.
- నిరంతరంగా దగ్గు రావడం, గొంతు నొప్పి, ఛాతీలో అసౌకర్యంగా ఉండటం.
- కళ్లలో మంటలు పుట్టడం, తలనొప్పి, చర్మ అలర్జీలు రావడం.
- ఆస్తమా, సిఓపిడి (COPD) లాంటి పాత శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఈ పొగ ప్రాణాంతకంగా మారడం.
- చిన్న పిల్లలు, వృద్ధుల ఊపిరితిత్తులు చాలా సున్నితంగా ఉండటం వల్ల వారు త్వరగా జబ్బుల బారిన పడటం.
సురక్షితంగా ఉండటానికి నిపుణులు చెప్తున్న చిట్కాలు
దోమల నివారణ ఉత్పత్తులను కొనేటప్పుడు ప్యాకెట్ మీద CIR రిజిస్ట్రేషన్ నంబర్ కచ్చితంగా ఉందో లేదో చూసుకోవాలి. వీలైనంత వరకు స్థానిక మార్కెట్లలో దొరికే బ్రాండ్ లేని వస్తువులను వాడటం పూర్తిగా ఆపేయాలి. ఒకవేళ ఇంట్లో అగరుబత్తులు వెలిగిస్తే గది కిటికీలు, తలుపులు తీసి ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. చిన్న పిల్లలు, వయసైన వారు ఉన్న గదుల్లో ఈ పొగ అస్సలు లేకుండా జాగ్రత్తపడాలి. అన్నింటికంటే ఉత్తమమైన మార్గం కిటికీలకు దోమల జాలీలు అమర్చుకోవడం, పడుకునేటప్పుడు దోమతెరలు వాడటం అలవాటు చేసుకోవాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

