Kalyandurgam:వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గంను సమగ్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా నిత్యము పనిచేస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు పేర్కొన్నారు.
పట్టణములోని శ్రీ సాయి సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణమండపంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు నిర్వహించిన పౌర సన్మానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో సాగునీటి వనరులు లేక రైతులు వలస పోతున్నారని శాశ్వత కరువు నివారణ కోసం చేపట్టిన 114 చెరువులకు సాగునీరు అందించే పథకాన్ని 2029 లోగా పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలకు ఆయన సమాధానం ఇస్తూ ఎన్నికల హామీని 2029 లోగా పూర్తి చేశాకే ప్రజలను ఓటు(Kalyandurgam) అడుగుతామని అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో అభిమానంతో తనకు పౌర సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నెరవేర్చి దిశగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా డాక్టర్ లింగారెడ్డి వ్యాఖ్యతగా నాగేష్ పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

