Kalyandurg News | కళ్యాణదుర్గం, జూన్ 16 : రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం, దేశంలో 12 ఏళ్ల విశ్వాస్, వికాస్, జన్ కళ్యాణ్ విజయోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కోసం ఎన్ డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి సహకారం అందిస్తున్నారని, రాజధాని అమరావతిని తిరిగి 2024న పునఃప్రారంభించారని, రాష్ట్రం అభివృద్ధి కోసం కోసం 20 వేలకోట్లు కేంద్ర ప్రభుత్వం అందించగా రాష్ట్ర ప్రభుత్వం మరో 50 వేల కోట్లు సమాకుర్చుకుని అభివృద్ధి సంక్షేమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ పనిచేస్తున్నారని అన్నారు..
Read Also : చంద్రబాబుకు వైఎస్ జగన్ అల్టిమేటమ్
ఎన్డీఏ కూటమి నాయకులు జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అద్భుత విజయం సాధించారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ అమరావతిలోని ప్రజావేదిక కూల్చి వేతతో అరాచక పాలన సాగించారని, ఐదేళ్లలో ఏకంగా 11 లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేశారని, నూటికి 90% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆదారపడి జీవనం చేస్తుంటే గడిచిన ఐదేళ్లు రైతులకు ఎలాంటి వ్యవసాయ పరికరాలు అందించకుండా, సాగునీటి ప్రాజెక్ట్ లను గాలికి వదిలేసి నిండా ముంచేసా డన్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి 14 స్థానాలు కూడా కూటమికి అందించి న ప్రజల కోసం మాల్యాల నుంచి హంద్రీ నీవా కాలువ వెడల్పు చేసి మరింత ఎక్కువ నీళ్లు అందిస్తున్నారని, అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా 4000 రూపాయలు వృద్ధాప్య, వితంతు పింఛన్, మహిళలకు ఉచిత బస్సు పథకం, రైతులకు పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ, ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నామని, జగన్ రెండు సార్లు కళ్యాణదుర్గం వచ్చిన ప్పుడు వారంలో, నెలలో బీటీపీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి ఐదేళ్లు కాలం వెళ్ళ దీసాడని, అప్పుడు కూడా మీరే కాంట్రాక్టర్ కదా ఎందుకు పనులను చేయలేదని అడిగే రంగయ్య బీటీపీ పనులే, కాదు పక్కన ఉన్న పేరూరు ప్రాజెక్ట్ కూడా ఆపింది మీ జగన్మోహన్ రెడ్డి అన్నది ముందు తెలుసుకోవాల న్నారు..
తెలుగుదేశం పార్టీ అంటేనే బలమైన, నమ్మకమైన కార్యకర్తలు ఉండటం నేను గెలిచి మీ మధ్య ఉండటం చాలా గొప్ప విషయమన్నారు.. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత మీ వైసీపీ నాయకులదే అన్న విషయం కూడా తెలుసుకో రంగయ్య, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ఆడుకుంటా అన్నారు..
మా నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఎవర్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారంలోగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కుళాయి వేసి తాగునీరు అందించే పథకానికి భూమిపూజ చేస్తామన్నారు.
Kalyandurg News
ఈ కార్యక్రమంలో బీజేపీ ఇంచార్జ్ ముప్పురి దేవరాజు, జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్, టీడీపీ నాయకులు చౌలం మల్లికార్జున, కరణం రామాంజ నేయులు, గాజుల శ్రీరాములు, ఆవుల తిప్పేస్వామి, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నీలాస్వామి, మార్కెట్ యార్డు చైర్మన్ గోళ్ళ లక్ష్మీదేవి రమేష్, వైస్ చైర్మన్ కోనంకి రాజశేఖర్, సింగిల విండో అధ్యక్షుడు మల్లిపల్లి నారాయణ, అమిలినేని లక్ష్మీనారాయ ణ, డీకే రామాంజనేయులు, గొర్ల గోవిందురాజులు, పార్లమెంట్ కార్యదర్శి షామీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని శ్రీనివాసులు రెడ్డి, కన్వీనర్ శివన్న, మాజీ జడ్పీటీసీలు కొల్లాపురప్ప, పద్మావతి, గురుప్రసాద్, తలారి ఎర్రిస్వామి, కొండాపురం అనిల్ చౌదరి, శర్మాస్, మాజీ సర్పంచులు బొజ్జన్న, లాల్ కృష్ణ, కుమార్, దొనస్వామి, మహిళా నాయకురాళ్లు మహాలక్ష్మి, ప్రియదర్శిని, కోనంకి అమరబిందు, కల్పన, నిర్మల, మణి, టీడీపీ నాయకులు, కూటమి నాయకులతో కలసి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

