KTR New Look: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన సరికొత్త లుక్‌తో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ఎప్పుడూ క్లీన్ షేవ్, ఫార్మల్ స్టైల్‌లో కనిపించే ఆయన, ఈసారి గడ్డంతో దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర ఆసక్తికర చర్చకు దారితీసింది.
ఆయనకు సంబంధించిన ఈ కొత్త లుక్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆయన లుక్‌ను 'మాస్ లుక్' అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Also : Vivek Venkataswamy: ఈవీలు, సోలార్ వినియోగం పెంచాలి: మంత్రి వివేక్
‘That much is a must’ - KTR’s witty remark on his new look
KTR New Look: రామగుండం పర్యటనలో ఆశ్చర్యపోయిన పార్టీ శ్రేణులు
రామగుండంలో నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో పాల్గొనేందుకు కేటీఆర్ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయల్దేరిన సమయంలో ఈ కొత్త అవతారంలో కనిపించారు. ఎప్పుడూ లేనిది ఆయన గడ్డంతో దర్శనమివ్వడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం రామగుండం వెళ్లే మార్గమధ్యంలో కరీంనగర్ వద్ద మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సతీశ్ బాబు తదితర ముఖ్య నాయకులు కేటీఆర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గడ్డం లుక్‌ను చూసిన గంగుల కమలాకర్, 'ఏందీ సంగతి.. గడ్డం పెంచినవ్?' అని సరదాగా ప్రశ్నించారు. దానికి కేటీఆర్ తనదైన నవ్వుతో సమాధానమిస్తూ.. “పోయేది గోదావరిఖనికే కదా.. సింగరేణికే కదా! ఆ మాత్రం ఉండాలే.. లేకపోతే నడవదు” అని చమత్కరించారు. సింగరేణి బొగ్గు గని ప్రాంత పర్యటనకు వెళ్తున్నందుకే మాస్ వైబ్‌కు తగ్గట్టుగా ఇలా సిద్ధమయ్యానని ఆయన సరదాగా చెప్పడంతో అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా నవ్వులు పూయించారు.
సోషల్ మీడియాలో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్రెండింగ్
కేటీఆర్ కొత్త లుక్ చూసి ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ఆయన ఫొటోలను విస్తృతంగా షేర్ చేస్తూ 'బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ మాస్ లుక్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు తమ ఆహార్యం విషయంలో పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడరు. కానీ, కేటీఆర్ ఇలా ట్రెండీగా లుక్ మార్చడం, దానికి సింగరేణి పర్యటనను ముడిపెడుతూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కరెంట్ కోతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. అధికారులకు వార్నింగ్

