Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ మూడు జట్లకు ఇక ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే!

ఆ మూడు జట్లకు ఇక ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే!

వార్త 2 weeks ago

IPL 2026 Playoff: ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశ ముగింపు దశకు రావడంతో ప్లేఆఫ్స్ బెర్తుల కోసం జట్ల మధ్య పోరు తీవ్రతరమైంది. కొన్ని జట్లు ఊపిరి పీల్చుకుంటుండగా, మరికొన్ని జట్లు 'డేంజర్ జోన్'లో కొట్టుమిట్టాడుతున్నాయి.

ముఖ్యంగా లక్నో, ముంబై, కోల్‌కతా జట్లకు ఇప్పుడు గెలుపు తప్ప మరో మార్గం లేదు.

Read Also :Rohit Sharma fast fifty: రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ!

డేంజర్ జోన్లో ఉన్న జట్ల పరిస్థితి (Must Win Games):

 IPL Points Table Update

పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే అద్భుతాలు చేయాల్సి ఉంది:

  • లక్నో సూపర్ జెయింట్స్ (LSG): లక్నో తన తదుపరి 5 మ్యాచుల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటిదారి పట్టక తప్పదు.
  • ముంబై ఇండియన్స్ (MI): హార్దిక్ పాండ్యా సేన మిగిలిన 4 మ్యాచుల్లో విజయం సాధించడమే కాకుండా, ఇతర జట్ల గెలుపోటములపై (Net Run Rate) ఆధారపడాలి.
  • కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

IPL 2026 Playoff: టాప్ జట్ల సమీకరణాలు (Playoff Scenarios):

పట్టికలో పైన ఉన్న జట్లు సేఫ్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తున్నా, చిన్న పొరపాటు జరిగినా సమీకరణాలు మారిపోతాయి:

  • PBKS & RCB: పంజాబ్, బెంగళూరు జట్లు తమ తదుపరి 5 మ్యాచుల్లో కేవలం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయమవుతుంది.
  • SRH, RR & GT: హైదరాబాద్, రాజస్థాన్ మరియు గుజరాత్ జట్లు మిగిలిన 4 మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయం సాధిస్తే చాలు.
  • CSK & DC: చెన్నై, ఢిల్లీ జట్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇవి తమ తదుపరి 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలో గెలవాల్సి ఉంటుంది.

రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అజింక్యా రహానే వంటి సీనియర్ కెప్టెన్లు తమ జట్లను ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కిస్తారో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

16 బంతుల్లో 50 కొట్టిన నికోలస్ పూరన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha