Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ పాత నోట్లు చెల్లవా?.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ

ఆ పాత నోట్లు చెల్లవా?.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్లారిటీ

వార్త 1 week ago

2005 Old Currency Notes: సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లకు సంబంధించి వస్తున్న ఒక వార్త ఇప్పుడు సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా పాత నోట్లను దాచుకున్న వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

2005వ సంవత్సరానికి ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్‌కు చెందిన ₹10, ₹20, ₹50, ₹100 నోట్లు జూన్‌ 30 తర్వాత చెల్లవంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈ నోట్లను అస్సలు స్వీకరించదంటూ ఒక మెసేజ్ నెట్టింట తెగ వైరలవుతోంది.

Read also: Maharashtra TET 2026 paper leak: మహారాష్ట్రలో TET పేపర్ లీక్.. పరీక్ష వాయిదా!

 Are those old notes no longer valid? Bank of Maharashtra clarifies.

2005 Old Currency Notes: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వివరణ

ఈ ప్రచారంపై బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తక్షణమే స్పందించి, కీలక ప్రకటన చేసింది. తమ బ్యాంక్ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. తాము అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు బ్యాంక్ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చింది. పాత నోట్లు చెల్లవన్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ (RBI) రూల్స్ ఏం చెబుతున్నాయి?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారం.. 2005కు ముందు ముద్రించిన మహాత్మా గాంధీ సిరీస్‌ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైన కరెన్సీయే. వీటిని రద్దు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ఎప్పుడూ ప్రకటించలేదు. అయితే, 2015లో ఈ నోట్ల చలామణిని క్రమంగా తగ్గించామని, ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే వాటిని బ్యాంకులకు తీసుకెళ్లి కొత్త నోట్లతో మార్చుకోవచ్చని గతంలోనే సూచించింది. కొత్తగా ముద్రించే నోట్లలో అత్యంత అధునాతనమైన భద్రతా ఫీచర్లు ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. దీనివల్ల మార్కెట్లో నకిలీ నోట్ల చలామణిని అరికట్టడం ప్రభుత్వానికి సులభమవుతుంది. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే పాత నోట్లను మార్చుకోవాలని ఆర్‌బీఐ కోరింది తప్ప, వాటిని రద్దు చేయలేదని గుర్తుంచుకోవాలి.

వదంతులను నమ్మవద్దు!

ప్రజలు సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లలో వస్తున్న ఇలాంటి రూమర్లను నమ్మి ఆందోళన చెందవద్దని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. కరెన్సీ నోట్ల రద్దు లేదా మార్పులకు సంబంధించి కేవలం ఆర్‌బీఐ లేదా ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

అయోధ్య రామాలయం విరాళాలపై ప్రియాంక గాంధీ విమర్శలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha