Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ పాత్రకు నేను సెట్ కాలేదేమో అనిపించింది: సాయి పల్లవి

ఆ పాత్రకు నేను సెట్ కాలేదేమో అనిపించింది: సాయి పల్లవి

వార్త 2 weeks ago

Sai Pallavi Bollywood Debut: ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన సాయి పల్లవి నటించిన తొలి బాలీవుడ్ చిత్రం 'ఏక్ దిన్' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.. ఈ నేపథ్యంలో సాయి పల్లవి తన అరంగేట్రం, పాత్ర ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Read Also:Desert Warrior : వామ్మో .. 1400 కోట్లతో డెజర్ట్ వారియర్ తీస్తే రూ. 6 కోట్లు వచ్చాయి

 Sai Pallavi Latest Interview

సినిమాను ఎంచుకోవడానికి కారణం

వరుసగా బరువైన మరియు భావోద్వేగభరితమైన పాత్రలు చేస్తున్న సమయంలో, మనసుకు తేలికగా అనిపించే కథ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నట్లు ఆమె తెలిపారు.ఈ కథ విన్నప్పుడు ఆమెకు ఇష్టమైన హాలీవుడ్ చిత్రం 'బిఫోర్ సన్‌రైజ్' గుర్తుకు వచ్చిందని, అందుకే వెంటనే అంగీకరించానని వెల్లడించారు.ఎటువంటి ఒత్తిడి లేకుండా షూటింగ్ చాలా ప్రశాంతంగా గడిచిందని ఆమె పేర్కొన్నారు.

Sai Pallavi Bollywood Debut: ఆమిర్ ఖాన్‌తో సాయి పల్లవి ఏమన్నారంటే?

సినిమా పూర్తయ్యాక తన నటనపై తనకే కొన్ని సందేహాలు కలిగాయని సాయి పల్లవి నిజాయతీగా ఒప్పుకున్నారు.ప్రీమియర్ చూసిన తర్వాత ఆ పాత్రకు తాను సరిపోలేదని ఆమెకు అనిపించిందట.”ఈ పాత్రకు మరింత ఉత్సాహంగా ఉండే ఏదైనా కొత్త నటిని ఎంపిక చేసి ఉంటే బాగుండేది” అని స్వయంగా ఆమిర్ ఖాన్‌కే చెప్పినట్లు ఆమె వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha