Tamil Nadu Political Crisis: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే చీఫ్ విజయ్ ఘనవిజయం సాధించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలను సాధించకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
ఈ క్రమంలో విజయ్ గురువారం లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Also:Kerala New CM: ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రిపై తుది నిర్ణయం
విజయ్‌ను అభిమన్యుడితో పోల్చిన పోసాని
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నటుడు పోసాని కృష్ణమురళి స్పందిస్తూ విజయ్‌ను కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడితో పోల్చారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ప్రత్యర్థి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
Posani Krishna Murali on Vijay
తన చుట్టూ ఇన్ని గొడవలు జరుగుతున్నా, విజయ్ ఎంతో నిబ్బరంగా ఉన్నాడని పోసాని ప్రశంసించారు.గతంలో మెజార్టీ రాకపోయినా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చేవారని, కానీ ఇప్పుడు గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినా సరే, విజయ్ గవర్నర్‌పై ఒక్క విమర్శ కూడా చేయకపోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు.
Tamil Nadu Political Crisis: డీఎంకే, అన్నాడీఎంకే కలయికపై విస్మయం
పరస్పరం బద్ధశత్రువుల్లా ఉండే డీఎంకే, అన్నాడీఎంకేలు.. విజయ్ ముఖ్యమంత్రి అవ్వకూడదనే ఉద్దేశంతో ఏకమవుతున్నాయనే వార్తలపై పోసాని తీవ్రంగా స్పందించారు.పాకిస్థాన్, భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఆ రెండు పార్టీలు అంత దూరంగా ఉంటాయని, అలాంటిది విజయ్‌ను అడ్డుకునేందుకు అవి కలవడం ఘోరమని పేర్కొన్నారు.
విజయ్ ఒకరిని కొట్టి పైకి రావాలని చూసే వ్యక్తి కాదని, పదవిలోకి వస్తే ప్రజలకు మంచి చేయొచ్చనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాడని పోసాని తెలిపారు. “1996 నుంచి నాకు విజయ్ తెలుసు. ఆయన ఎవరినీ తిట్టలేదు, ఎవరినీ విమర్శించలేదు. అలాంటి మంచి వ్యక్తే ప్రజలకు నిజమైన సేవ చేయగలుగుతాడు” అని పోసాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ఈడీ దాడులు: భయంతో తొమ్మిదో అంతస్తు నుంచి నోట్ల బ్యాగుల విసిరివేత

