Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ తండ్రికి మనసు ఎలా వచ్చిందో!..ఊహించని దారుణానికి ఒడిగట్టాడు

ఆ తండ్రికి మనసు ఎలా వచ్చిందో!..ఊహించని దారుణానికి ఒడిగట్టాడు

వార్త 2 weeks ago

Khammam Crime : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో గుండెలను పిండేసే తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే దారుణానికి ఒడిగట్టి, కనుపాపలలా చూసుకోవాల్సిన కన్నపిల్లలకు కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాపించి, తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఘటనలో తండ్రితో పాటు కూతురు ప్రాణాలు కోల్పోగా, కుమారుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

Vizianagaram Murder : విజయనగరంలో దారుణం: ప్రియుడిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన మహిళ

 Khammam Crime

Khammam Crime : ఘటన వివరాలు & ప్రస్తుత పరిస్థితి:

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాసరావు (38) ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం తన కూతురు లాస్య (14), కొడుకు నిఖిల్ (11)లను బైక్‌పై గండ్రాయిలోని పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇచ్చి, తాను కూడా తాగాడు. పడిపోయి ఉన్న వారిని స్థానికులు గమనించి దవాఖానకు తరలించగా, మార్గమధ్యలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు. చికిత్స పొందుతూ కూతురు లాస్య కన్నుమూసింది. తీవ్ర పరిస్థితిలో ఉన్న కొడుకు నిఖిల్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.శ్రీనివాసరావుకు తగినంత భూమి, సాగు ఉండి ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ఈ దారుణ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మిస్టరీగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

సింగరేణిలో విషాదం.. వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha