Vizianagaram Murder : విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో తీవ్ర కలకలం రేపిన హత్య ఘటన వెలుగుచూసింది. భర్తకు దూరంగా ఉంటున్న దనాల రాములమ్మ, భార్యకు దూరంగా ఉంటున్న తన బావ కుమారుడు శ్రీనుతో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.
అయితే వీరిద్దరి మధ్య తలెత్తిన తీవ్ర వివాదం ఒకరి ప్రాణాలను తీయగా, మరొకరిని ఆస్పత్రి పాలు చేసింది.
Rajasthan Road Accident: కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు అక్కడికక్కడే మృతి!
Vizianagaram Murder
Vizianagaram Murder :ఘటన ఎలా జరిగింది?
గురువారం తెల్లవారుజామున రాములమ్మ, శ్రీను మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన రాములమ్మ ఇనుపరాడ్డుతో శ్రీను తలపై బలంగా బాదింది. అంతటితో ఆగకుండా అతనిపై యాసిడ్ పోయడంతో తీవ్రగాయాలైన శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రాములమ్మ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ శంకరరావు, ఎస్సై లోకేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి బంధాలు క్షణికావేశంలో దారుణ నేరాలకు దారితీస్తున్నాయి. నమ్మకం లేని బంధాల వల్ల ఇరువైపులా కుటుంబాలు చిన్నాభిన్నమై తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి.
సింగరేణిలో విషాదం.. వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

