Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆధార్, పాన్ కార్డుల నకిలీ దందా .. ఒకరి అరెస్ట్

ఆధార్, పాన్ కార్డుల నకిలీ దందా .. ఒకరి అరెస్ట్

వార్త 3 weeks ago

Fake Aadhaar Cards: ఆధార్, పాన్ కార్డుల్లో పేర్లు, ఫొటోలు, పుట్టిన తేదీలు, చిరునామాలను అక్రమంగా మార్చి నకిలీ పత్రాలు తయారు చేస్తున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు.

రాజేంద్రనగర్ లో శంషాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణ మోహన్ వివరాలు వెల్లడించారు…జల్‌పల్లికి చెందిన చి. మహదేవ్ (36) బుద్వేల్ లో 'కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్' పేరుతో జిరాక్స్ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆధార్, పాన్ కార్డుల వివరాలను అక్రమంగా మార్చడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also :Moinabad Students Death: పోలీస్‌ పెట్రోలింగ్‌ చూసి పరుగులు.. విద్యుత్‌ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థులు మృతి

Fake Aadhaar Cards: పుట్టిన తేదీ మార్పునకు రూ.300, కార్డులోని పూర్తి వివరాల మార్పునకు రూ.700 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నకిలీ కార్డులను కొందరు ప్రైవేటు ఉద్యోగాలు, సిమ్ కార్డులు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 60 నకిలీ ఆధార్ కార్డులు, 2 పాన్ కార్డులు, ల్యాప్‌టాప్, ప్రింటర్, లామినేషన్ యంత్రం, మొబైల్ ఫోన్, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.ఈ అరెస్టులో ఎస్‌ఐలు ఎస్. శేషు, కె. మన్సూర్ అలీ, ఎన్. నర్సింగరావు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, పహాడీషరీఫ్ పోలీసులు పాల్గొన్నారు.

ప్రయాణికుడి చివరి సెల్ఫీ వీడియో వైరల్‌

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha