Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ముహూర్తం ఫిక్స్

వార్త 2 months ago

CM Revanth: తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు పనులు ఇప్పటికే ఊపందుకోగా, తాజాగా ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో జరిగిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపించారు.

Read Also: Change of District Boundaries : జిల్లాల సరిహద్దుల మార్పుపై మరోసారి సీఎం రేవంత్ కీలక ప్రకటన

CM Revanth: జూన్ 2 లోపు ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం

ఆదిలాబాద్ ప్రజల చిరకాల కోరికైన విమానాశ్రయ నిర్మాణంపై సీఎం సానుకూలంగా స్పందించారు. “కొత్త ఎయిర్‌పోర్టు అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చించాం. వీలైతే జూన్ 2వ తేదీ లోపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత నేను తీసుకుంటా” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఎయిర్‌పోర్టుతో పాటు ఆదిలాబాద్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను ఆదిలాబాద్‌కు మంజూరు చేసి ఇక్కడి ఆదివాసీలకు ఉపాధి మార్గాలు చూపిస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. దానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్‌కు కొత్త యూనివర్సిటీ ఇస్తాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవం ఉంటుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కిడ్నాపర్ల చెర నుండి చిన్నారిని కాపాడిన యువకుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha