Dailyhunt
కిడ్నాపర్ల చెర నుండి చిన్నారిని కాపాడిన యువకుడు

కిడ్నాపర్ల చెర నుండి చిన్నారిని కాపాడిన యువకుడు

వార్త 1 week ago

Hyderabad: సమాజంలో నేరాలు జరుగుతున్నప్పుడు 'మనకెందుకులే' అని మౌనంగా ఉండకుండా, బాధ్యతాయుతమైన పౌరుడిగా స్పందిస్తే ఎంతటి ప్రమాదాన్నైనా నివారించవచ్చని మహ్మద్ ఫిరోజ్ అనే యువకుడు నిరూపించారు.

అబిడ్స్ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురైన ఎనిమిదేళ్ల పాఠశాల విద్యార్థినిని తన ప్రాణాలకు తెగించి రక్షించిన ఫిరోజ్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఘనంగా సన్మానించారు.

Read Also:Bhupalpally Crime : భూపాలపల్లిలో సంచలనం రేపిన హత్య ఘటన

అసలేం జరిగింది? ఆటో డ్రైవర్ కిడ్నాప్ ప్లాన్

ఈ నెల 1వ తేదీన అబిడ్స్ ప్రాంతంలో స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న 8 ఏళ్ల బాలికను మెహదీపట్నంకు చెందిన ఆటో డ్రైవర్ సలీం మాయమాటలు చెప్పి తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ చిన్నారిని గోల్కొండలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.

సమయస్ఫూర్తితో స్పందించిన ఫిరోజ్

అదే సమయంలో సమీపంలోని మసీదు నుంచి బయటకు వస్తున్న ఫిరోజ్, ఆటోలో చిన్నారి ఏడుపును గమనించారు. ఏదో అనర్థం జరుగుతుందని అనుమానించిన ఆయన వెంటనే ఆటోను అడ్డుకున్నారు. ఫిరోజ్ గట్టిగా నిలదీయడంతో భయపడిన ఆటో డ్రైవర్ సలీం, చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు.

పోలీసుల వేగవంతమైన చర్యలు

చిన్నారిని రక్షించిన ఫిరోజ్ అంతటితో ఆగకుండా, బాలిక ఐడీ కార్డులోని ఫోన్ నంబర్ ఆధారంగా ఆమె తండ్రికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అబిడ్స్ బ్లూ కోట్స్ కానిస్టేబుళ్లు సాయికృష్ణ, కేదార్ సింగ్ గోల్కొండకు చేరుకుని బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సలీంను ఏప్రిల్ 2న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Hyderabad: సీపీ సజ్జనార్ ప్రశంసలు, రివార్డు

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు స్పందించే గుణం గొప్పదని అన్నారు. నేరం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండకుండా ఫిరోజ్ చూపిన చొరవ వెలకట్టలేనిదని ప్రశంసించారు. ప్రతి పౌరుడు ఫిరోజ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని.. నేర రహిత సమాజం కోసం పోలీసులతో సహకరించాలని కోరారు. అలాగే సమర్థవంతంగా పనిచేసిన కానిస్టేబుళ్లను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమయానికి స్పందించిన ఫిరోజ్ వల్ల ఒక చిన్నారి జీవితం సురక్షితంగా మిగిలిందని.. ఇలాంటి సాహసాలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జిల్లాల సరిహద్దుల మార్పుపై మరోసారి సీఎం రేవంత్ కీలక ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha