Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదివారం చికెన్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఆదివారం చికెన్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

వార్త 2 weeks ago

Telugu states chicken prices: ఆదివారం వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

మార్కెట్ లోతెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను పరిశీలిస్తే మాంసం ప్రియులకు ఇది ముఖ్యమైన సమాచారం. గత వారంతో పోలిస్తే ధరలలో పెద్దగా మార్పులు రాలేదు, ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమకి నచ్చిన విధంగా చికెన్ కొనుగోలు చేసుకోవచ్చు.

Read also: TG Bar and Restaurant: సోమవారం నుంచి అన్ని బార్లు మూత?

 telugu states chicken prices

తెలంగాణ నగరాలలో మాంసం ధరలు

హైదరాబాద్ నగరంలో గత వారం రూ.280 నుంచి రూ.300 వరకు ఉన్న స్కిన్ లెస్ చికెన్ ధర ఇప్పుడు రూ.280 నుంచి రూ.310 వరకు ఉంది. ఖమ్మం జిల్లాలో రూ.300 ఉండగా సూర్యాపేటలో రూ.280గా ఉంది. నిజామాబాద్ ప్రాంతంలో రూ.270 చొప్పున దుకాణదారులు విక్రయిస్తున్నారు.

Telugu states chicken prices: ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో చికెన్ రేట్లు

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నగరంలో రూ.280 పలుకుతుండగా గుంటూరు ప్రాంతంలో రూ.260గా ఉంది. వివిధ ప్రాంతాలలో డిమాండ్ ని బట్టి ధరలలో చిన్నపాటి తేడాలు కనిపిస్తున్నాయి. నాన్ వెజ్ ప్రియులు ఆదివారం పూట సమీపంలోని మార్కెట్ కి వెళ్లి తాజాగా ఉన్న చికెన్ ని కొనుగోలు చేయవచ్చు.

Epaper: epaper.vaartha.com

నేడు స్థిరంగా బంగారం ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha