TG Bar and Restaurant:రాష్ట్రంలో ఉన్న 1185 బార్ అండ్ రెస్టారెంట్లు సోమవారం నుంచి మూతపడనున్నాయి. ప్రభుత్వం విధిస్తున్న అదనపు పన్నులు మరియు ప్రివిలేజ్ ఫీజును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఖైరతాబాద్‌లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఈ బంద్ ప్రకటన చేశారు.
All bars closed from Monday
Read also: Hyderabad local trains: రైలు ఎక్కాలంటే నిచ్చెన కావాల్సిందేనా?
ప్రివిలేజ్ ఫీజు పెంపుపై తీవ్ర ఆగ్రహం
మంత్రివర్గ సమావేశంలో ప్రివిలేజ్ ఫీజును స్లాబ్ పద్ధతిలో 8 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడం పట్ల యాజమాన్యాలు మండిపడ్డాయి. గతేడాది రెన్యువల్ తర్వాత ఇప్పటికే 4 లక్షల రూపాయల చొప్పున అదనంగా లైసెన్స్ ఫీజు పెంచారని గుర్తుచేశారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక భారంతో సతమతమవుతున్న తమపై ఈ కొత్త ఫీజుల మోత మోపడం తగదని స్పష్టం చేశారు.
TG Bar and Restaurant:బెల్ట్ షాపులతో జీవనోపాధికి ముప్పు
గల్లీ గల్లీలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల వల్ల తమ వ్యాపారాలు మరియు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నప్పటికీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈనెల 5వ తేదీలోపు ప్రివిలేజ్ ఫీజు జీవోను పూర్తిగా రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Epaper: epaper.vaartha.com

