Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ.. ఆ మరుసటి బంతికే అవుటైన రాహుల్

ఆఫ్ఘనిస్థాన్‌పై సెంచరీ.. ఆ మరుసటి బంతికే అవుటైన రాహుల్

వార్త 2 months ago

IND vs AFG: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో మెరిశాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న ఆనందం అతనికి ఎంతోసేపు నిలవలేదు.

శతకం బాదిన మరుసటి బంతికే పెవిలియన్ చేరి తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా సెంచరీ మార్కును పూర్తి చేయగానే తర్వాతి బంతికే ఔటవ్వడం రాహుల్‌కు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

Read Also : India T20 Squad:కెప్టెన్‌గా అయ్యర్..సూర్యవంశీకి ఛాన్స్!

Century against Afghanistan.. Rahul was out on the very next ball

IND vs AFG: తొలి రోజు భారత్ బ్యాటింగ్ జోరు

చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (100) సెంచరీకి తోడు, యువ ఆటగాడు సాయి సుదర్శన్ (81), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (65 బ్యాటింగ్) అర్ధశతకాలతో అద్భుతంగా రాణించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

రాహుల్, సుదర్శన్ భారీ భాగస్వామ్యం

ఇన్నింగ్స్ ఆరంభంలో యశస్వి జైస్వాల్ (24) త్వరగా ఔటైనప్పటికీ, రెండో వికెట్‌కు రాహుల్, సాయి సుదర్శన్ జంట కలిసి 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సుదర్శన్ అవుటయ్యాక, కెప్టెన్ గిల్‌తో కలిసి రాహుల్ మూడో వికెట్‌కు మరో 67 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే రాహుల్ టెస్టుల్లో తన 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్ జియావుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో శతకం సాధించిన రాహుల్, ఆ తర్వాతి బంతికే కవర్ డ్రైవ్ ఆడబోయి గుర్భాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. క్రీజులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల వేట కొనసాగిస్తుండగా, అతనికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఆటలో భారత్ మరింత భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించాలని భావిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC మరో నోటిఫికేషన్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha