Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC మరో నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC మరో నోటిఫికేషన్ విడుదల

వార్త 2 months ago

TGPSC notification: తెలంగాణలోని నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వరుస నోటిఫికేషన్లతో భారీ ఊరటనిస్తోంది. కమిషన్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉద్యోగాల నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ ముమ్మరం చేసింది.

పాత నియామకాలతో పాటు సరికొత్త ఉద్యోగ ప్రకటనలను వేగవంతం చేస్తూ, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మరొక కీలకమైన ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేసి అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది.

Read Also : Drowning Accidents In AP Telangana:సరదా ఈత ప్రాణాలు తీసింది..చెరువులు, నదుల్లో మునిగి ఒకే రోజు 14 మంది దుర్మరణం!

 Good news for the unemployed.. TGPSC releases another notification

TGPSC notification: విద్యాశాఖలో కీలక పోస్టుల భర్తీ

రాష్ట్ర విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (DEO), గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 (GHG) పోస్టుల భర్తీకి కమిషన్ శుక్రవారం నాడు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha