Central Government: దేశీయంగా చక్కెర (Sugar) ధరలను అదుపులో ఉంచేందుకు మరియు పండుగ సీజన్‌లో కృత్రిమ కొరతను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
చక్కెర వ్యాపారులు, టోకు వర్తకులు తమ వద్దకు వచ్చిన చక్కెరను 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదని నిబంధన విధించింది.అంతేకాకుండా, దేశంలో ఎక్కడైనా, ఏ సమయంలోనైనా వ్యాపారులు 4,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ ఉంచుకోవడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.
Central Government: ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు అమల్లో నిబంధనలు
రాబోయే పండుగల సీజన్‌లో చక్కెర లభ్యతను సులభతరం చేయడం మరియు అక్రమ నిల్వలను నిరోధించడమే లక్ష్యంగా కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు ఆగస్టు 1, 2026 నుండి నవంబర్ 30, 2026 వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.అయితే, ప్రభుత్వ నిల్వలు (Government Reserves) మరియు రేషన్ షాపుల (PDS) ద్వారా పంపిణీ చేసే చక్కెర సరఫరాలకు ఈ నిల్వ పరిమితి నిబంధనల నుండి మినహాయింపు ఇచ్చారు. వ్యాపారులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

