Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 17 నుండి భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య సర్వీసులు ప్రారంభం

ఆగస్టు 17 నుండి భోగాపురం విమానాశ్రయంలో వాణిజ్య సర్వీసులు ప్రారంభం

వార్త 3 weeks ago

Bhogapuram Airport : ఆగస్టు 17 నుండి వాణిజ్య సర్వీసులు: ఆగస్టు 1న విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసినప్పటికీ, అధికారికంగా ఆగస్టు 17 నుండి పౌర విమానాల వాణిజ్య సేవలు (Commercial Operations) ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

విశాఖ పాత ఎయిర్‌పోర్ట్‌లో పౌర విమానాల రాకపోకలు నిలిపివేసి, పూర్తి సర్వీసులను భోగపురానికి తరలించనున్నారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కోల్డ్-చైన్ సదుపాయాలతో కూడిన ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా సీఫుడ్, ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగి ఉత్తరాంధ్ర పారిశ్రామిక, పర్యాటక రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు.

Read Also: Green Field Highway : నేటి నుంచే సూర్యాపేట-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం

 Bhogapuram Airport

Bhogapuram Airport : ఎయిరిండియా ఫ్లైట్‌ షెడ్యూల్‌ విడుదల

ఎయిరిండియా (Air India) అక్టోబర్ 24 వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను ప్రకటించింది.ఈ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్-భోగాపురం మార్గంలో ప్రతిరోజూ ఐదు విమాన సర్వీసులు నడవనున్నాయి. అలాగే బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులు అందుబాటులో ఉండగా, ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసును నిర్వహించనున్నారు. అదేవిధంగా విజయవాడ-భోగాపురం మధ్య ప్రతిరోజూ నాలుగు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి దేశంలోని ప్రధాన నగరాలతో వైమానిక అనుసంధానం మరింత మెరుగుపడనుంది.

భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha