August Holidays:ఆగస్టు నెల వచ్చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, బ్యాంకు ఖాతాదారులకు సెలవుల సందడి మొదలైంది. ఈ నెలలో ఆదివారాలు, పండుగలు, స్వాతంత్ర్య దినోత్సవం, రెండో శనివారం మొత్తం కలిపి విద్యాసంస్థలకు 10 రోజుల వరకు, బ్యాంకులకు తొమ్మిదిరోజుల వరకు సెలవులు రానున్నాయి.
బ్యాంకు వినియోగదారులు తమ లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
List of holidays for the month of August
ఆగస్టు నెల సెలవుల జాబితా
ఆగస్టులో మొత్తం 31 రోజులుండగా, ఐదు ఆదివారాలు ఉన్నాయి. వీటితో పాటు 8వ రెండో శనివారం, 15న స్వాతంత్ర్య దినోత్సవం, 21న వరలక్ష్మీవ్రతం, 26న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సాధారణ సెలవులున్నాయి. అలాగే 17న నాగపంచమి, 28న రక్షాబంధన్ రోజుల్లో ఆప్షనల్ హాలిడేస్ పొందే అవకాశముంది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు 10 రోజుల వరకు సెలవులు లభించనున్నాయి. వరుస సెలవులతో విద్యార్థులు కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకోవడంతో పాటు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు, చిన్నపాటి విహారయాత్రలు చేసేందుకు అవకాశం దక్కనుంది.
August Holidays:ఆగస్టులో బ్యాంక్ సెలవులు
బ్యాంక్ ఖాతాదారులకు ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. బ్యాంకులకు ఐదు ఆదివారాలు, 8వ రెండో శనివారం, 22న నాలుగో శనివారం, 15న స్వాతంత్ర్య దినోత్సవం, 26న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మొత్తం తొమ్మిది రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, డీడీలు, ఇతర అత్యవసర బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా అవసరమైన పనులు ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

