Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. దంపతులు దుర్మరణం

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. దంపతులు దుర్మరణం

Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Young Woman Died in America : న్యూయార్క్‌లో గుండెపోటుతో ఖమ్మం యువతి అక్షిత మృతి

 Couple killed after their bike rams into a lorry

Srikakulam Road Accident: మృతులు శ్రీకాకుళం గుజరాతి పేటకు చెందిన దంపతులు

ఈ ప్రమాదంలో మరణించిన వారిని శ్రీకాకుళం నగరం గుజరాతి పేటకు చెందిన తిప్పన పార్వతి, రామారావులుగా పోలీసులు అధికారికంగా గుర్తించారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో వారి స్వగ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha