Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

Noida Fire Accident: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శనివారం మధ్యాహ్నం దారుణ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఐదు దుకాణాలు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి.

నోయిడా సెక్టార్ 125 పరిధిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టీ, స్నాక్స్ షాపుల్లో మొదట మంటలు చెలరేగాయి.

Philippines Plane Crash: గాల్లోనే రెండు విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి!

 Major fire in Noida; one person dead

Noida Fire Accident: వేగంగా వ్యాపించిన మంటలు

సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌పూర్ ప్రాంతానికి ఈ మంటలు క్షణాల్లో వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరు ఫైర్ ఇంజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద తీవ్రత కారణంగా దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో అధికారులు ముందుజాగ్రత్తగా సమీప మార్గాలను మూసివేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

సహాయక చర్యలు అందిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

ఘటన స్థలంలో ఎల్పీజీ సిలిండర్లు

ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మరిన్ని పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని నోయిడా చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

అల్లూరి జిల్లాలో భారీ పేలుడు.. నలుగురు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha