LPG Subsidy Rules 2026: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా అధికారులు కొత్త ఎల్‌పీజీ కనెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో కొరత ఏర్పడటమే దీనికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు. జిల్లా సరఫరా అధికారి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న డిమాండ్‌ను తట్టుకోవడానికి, ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also:Vijay CM Ceremony : సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం…ఆనందం తో త్రిష కన్నీరు
Agra LPG Connection News
కొత్త కనెక్షన్లు ఇవ్వకపోయినప్పటికీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కనెక్షన్ బదిలీలకు అధికారులు అనుమతినిచ్చారు.మరణించిన వారి పేరు మీద ఉన్న కనెక్షన్లను వారి రక్త సంబంధీకులకు బదిలీ చేసుకోవచ్చు.మరణించిన వారి వివరాలు సమర్పించి, అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం ద్వారా ఈ బదిలీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
సబ్సిడీ నిబంధనల్లో మార్పులు.. ఎవరికి వర్తిస్తుంది?
నూతన నిబంధనల ప్రకారం గ్యాస్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న వినియోగదారులకు ఎల్‌పీజీ సబ్సిడీని పూర్తిగా రద్దు చేశారు. ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న పేద వర్గాలకు ఒక్కో సిలిండర్‌పై రూ. 350 సబ్సిడీ లభిస్తుంది.సాధారణ గృహ వినియోగదారులకు సిలిండర్‌పై సుమారు రూ. 12 సబ్సిడీ వర్తిస్తుంది.
LPG Subsidy Rules 2026: కొరత నివారణకు చర్యలు
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, మళ్లింపును అడ్డుకోవడానికి జిల్లా యంత్రాంగం నిఘా పెంచింది. సరఫరా మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు కొత్త కనెక్షన్ల విషయంలో ఇదే వైఖరి కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.మే 1 నుండి డెలివరీలకు ఓటీపీ ఆధారిత విధానం తప్పనిసరి. వినియోగదారులు ఇప్పుడు బుక్‌లెట్ లేదా రసీదు చూపించి సిలిండర్ లను పొందలేరు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

