Azadi 501 Series: ప్రస్తుతం వివిధ భాషలకు చెందిన వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ రంగంలో తమ ఉనికిని, బలాన్ని చాటుకోవడానికి సరికొత్త కాన్సెప్ట్‌లతో కథలు వస్తున్నాయి. అలా ‘ఆహా’ వేదికగా ప్రేక్షకులను పలకరించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ఆజాదీ 501’. సాయితేజ కల్వకోట ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు శివతేజ దర్శకత్వం వహించారు. జూలై 29 నుంచి 6 ఎపిసోడ్లతో ‘ఆహా’లో ఈ సిరీస్ ప్రసారమవుతోంది.
Read Also : Allu Arjun : స్టార్ హీరోలకు తలనొప్పి తెచ్చిన అల్లు అర్జున్ ?
‘Azadi 501’ Series Review on Aha!
Azadi 501 Series: కథాంశం
ఈ కథ 2014 నుంచి 2018 మధ్యకాలంలో కాకినాడ నేపథ్యంగా సాగుతుంది. తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత జితేంద్ర (సాయితేజ)పై పడుతుంది. తండ్రి నిర్మించిన స్కూల్‌ను కోర్టు వివాదాల నుంచి కాపాడుకోవడానికి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. స్మార్ట్‌ఫోన్ కొనాలనే సామాన్యుల కలను ఆసరాగా చేసుకుని, చైనా ఫోన్లను కొనుగోలు చేసి ‘మేడ్ ఇన్ ఇండియా’ లోగోతో మార్కెట్లోకి తక్కువ ధరకే తీసుకురావాలని ప్లాన్ వేస్తాడు. ‘ఆజాదీ 501’ పేరుతో సెంట్రల్ మినిస్టర్ శరత్ గోయెల్ (హర్షవర్ధన్) చేతుల మీదుగా ఫోన్‌ను లాంచ్ చేయించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాడు.
సవాళ్లు, క్లైమాక్స్ ట్విస్ట్
స్మార్ట్‌ఫోన్ సృష్టించిన సంచలనంతో జితేంద్ర సాధిస్తున్న లాభాలపై మంత్రి శరత్ గోయెల్ కన్నుపడుతుంది. మరోవైపు ఐపీఎస్ ట్రైనీ చాణక్య చక్రవర్తి (శశాంక్)కి ఈ ప్రొడక్ట్ పై అనుమానం రావడంతో, నిజానిజాలు తేల్చడానికి స్పెషల్ ఆఫీసర్ రఘురామ్ (రవివర్మ) రంగంలోకి దిగుతాడు. అధికార బలం, పలుకుబడి ఉన్న ముగ్గురు శక్తివంతమైన వ్యక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను జితేంద్ర ఎలా ఎదుర్కొన్నాడు? లంచాలు ఇవ్వకుండా, భయపడకుండా తన ప్లాన్‌ను ఎలా వర్కవుట్ చేశాడు? తండ్రి ఆశయాన్ని నెరవేర్చాడా లేదా? అనే అంశాలు కథలో ఆసక్తికరంగా సాగుతాయి.
విశ్లేషణ
గతంలో భారతదేశంలో సంచలనం సృష్టించిన ఒక భారీ స్మార్ట్‌ఫోన్ స్కామ్ ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. వ్యాపారం మరియు మోసం అనే రెండు కోణాలను స్పృశిస్తూ దర్శకుడు కథను ఆసక్తికరంగా నడిపించారు. కథ, స్క్రీన్‌ప్లే రెండూ చాలా స్పష్టంగా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సాగుతాయి. ప్రధాన పాత్రల రూపకల్పన బలంగా ఉండటంతో పాటు ముగింపులో వచ్చే ట్విస్ట్ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలుస్తుంది. మదర్ సెంటిమెంట్ మోతాదు కాస్త తగ్గడం, హీరో వైపు నుంచి లవ్ ట్రాక్ లేకపోవడం చిన్నపాటి లోపాలుగా అనిపించినప్పటికీ, ఒక భారీ స్కామ్ ఆధారంగా వచ్చిన ఉత్తమ థ్రిల్లర్ సిరీస్‌గా ‘ఆజాదీ 501’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

