Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రముఖ సింగర్ కె.జమునా రాణి ఇక లేరు

ప్రముఖ సింగర్ కె.జమునా రాణి ఇక లేరు

వార్త 3 weeks ago

Singer Jamuna Rani Passed Away: సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని కోకా జమునారాణి (88) కన్నుమూశారు. గురువారం బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఎపి లో జన్మించిన ఆమె 1946 లో ‘త్యాగయ్య’ చిత్రంతో గాన ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళ భాషల్లో 6 వేలకు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. 'ఎంత టక్కరి వాడు నారాజు', 'సరదా సరదా సిగరెట్టు', 'ముక్కుమీద కోపం.. నీ ముఖానికే అందం' వంటి ఎన్నో చిరస్మరణీయ గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆమె సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం అన్నాదురై పురస్కారం, కలైమామణి అవార్డులతో జమునా రాణిని సత్కరించింది.

Read Also : Actress Kirti Kulhari: సైబర్ మోసానికి గురైన బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి!

 Renowned singer K. Jamuna Rani is no more.

Singer Jamuna Rani Passed Away: తన కెరీర్‌లో జమునారాణి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో కలిపి 6 వేలకుపైగా పాటలు ఆలపించారు. 1940ల నుంచి 1980ల వరకు అనేక మంది అగ్ర హీరోలు, ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పని చేస్తూ తన గాత్రంతో ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించారు. ఆమె కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన పాటల్లో 'దేవదాసు' చిత్రంలోని "ఓ దేవత", "చెలియ లేదుష, అభిమానం లోని పద పదవే వయారి గాలిపటమా, మంచి మనసులు లోని మామ మామ మామ ఏమే ఏమే భామ , రాముడు భీముడు లోని సరదా సరదా సిగరెట్టు, లవకుశ లోని విరిసే చల్లని వెన్నెల , బంగారు తిమ్మరాజు లోని నాగమల్లి కోనలోన నక్కింది లేడి కున వంటి ఎన్నో సూపర్ హిట్ గీతాలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. సంగీత సంపదకు తన గాత్రంతో అపూర్వ సేవలందించిన జమునారాణి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె పాడిన వేలాది పాటలు సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, ఆమెను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి.

స్టార్ హీరోలకు తలనొప్పి తెచ్చిన అల్లు అర్జున్ ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha