Food security : ప్రస్తుత ప్రపంచ గమనంలో యుద్ధం అనేది కేవలం సరిహద్దులకు, సైనికులకు పరిమితమైన తుపాకీ గుళ్ల పోరాటం మాత్రమే కాదు అది సగటు సామాన్యుడి వంట గదిపై, అతడు తినే పళ్లెంలోని ఆహారంపై నేరుగా దాడి చేసే ఆర్థిక విపత్తు.
రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం నుంచి పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల వరకు ప్రతి సంఘర్షణ కూడా అంతర్జాతీయ సరఫరా గొలుసును చిన్నాభిన్నం చేస్తూ, సామాన్యుడిని ఆకలి కోరల్లోకి నెడు తున్నాయి. యుద్ధం ప్రారంభం కాగానే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకడం మనం చూస్తున్నాం. రవాణా వ్యయం పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు (Double the prices)అవుతాయి. ముఖ్యంగా ఎల్పిజి వంటి వంట గ్యాస్ ధరలపై దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. సహజ వాయువు ఉత్పత్తిలో రష్యా వంటి దేశాలు అగ్రగామిగా ఉన్నప్పుడు, అక్కడ యుద్ధం సంభ విస్తే సరఫరాలో అంతరాయం ఏర్పడి, దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడి భారానికి మించిపోతాయి.
Read Also : Petrol prices: పెట్రోల్ సంక్షోభంలో పాకిస్థాన్ .. లీటర్ ధర ఎంతంటే..
food security
food security : ఆహార భద్రత అనేది పెద్ద ప్రశ్నార్థకం
ఇది కేవలం గ్యాస్ ధరతోనే ఆగదు, ఎరువుల తయారీకి అవసరమైన అమ్మో నియా వంటి రసాయనాల ధరలు పెరగడంవల్ల వ్యవ సాయ రంగం కుదేలవుతుంది. రైతులు పండించే పంటల పెట్టుబడి పెరిగి, చివరికి మార్కెట్కు వచ్చేసరికి కూరగా యలు, ధాన్యాల ధరలు (Double the prices)సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుతాయి. ఉక్రెయిన్ ప్రపంచానికే ‘బ్రెడ్ బాస్కెట్ ‘ వంటి ది, అక్కడి నుంచి గోధుమల సరఫరా ఆగిపోతే ప్రపంచ వ్యాప్తంగా పిండి ధరలు పెరిగి పేదవాడి రొట్టె ముక్కను కూడా దూరం చేస్తాయి. యుద్ధం కొనసాగితే సముద్ర మార్గాల్లో రవాణా స్తంభించిపోతుంది. ఎర్ర సముద్రం వంటి కీలక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే కార్గో నౌకలు దారి మళ్లించాల్సి వస్తుంది, దీనివల్ల ఇన్సూరెన్స్ ప్రీమి యంలు పెరిగి ప్రతి వస్తువుపై అదనపు భారం పడు తుంది. యుద్ధం వల్ల కరెన్సీ విలువ పడిపోవడం మరో పెద్ద ముప్పు. రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే వంట నూనెలు (పామాయిల్, సన్ఫ్లవర్ఆయిల్) ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. భారత్ తన వంట నూనెల అవసరాల్లో సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి నల్ల సముద్రం ప్రాంతంలో యుద్ధం జరిగితే ఇక్కడ మన ఇళ్లలో పోపుడబ్బా ఖాళీ అవుతుంది. భవిష్యత్తులో యుద్ధం ఇలాగే కొనసాగితే ఆహార భద్రత అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశాలు తమ ఆహార నిల్వలను బయటకు పంపడానికి నిరాకరిస్తాయి (ప్రొటెక్షనిజం), దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడి ఆకలి చావులు సంభవించే ప్రమాదం ఉంది. యుద్ధం వల్ల కలిగే ద్రవ్యోల్బణం కేవలం అంకెల్లో ఉండదు. అది సామాన్యుడి పళ్లెంలో తగ్గుతున్న ముద్దల్లో కనిపిస్తుంది.
food security
పోరాటాల్లో చివరకు బల య్యేది పేదవాడి ఆకలి
శక్తి వనరుల కొరత వల్ల పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరగడం, ఆదాయం తగ్గి ఖర్చులు పెరగడం అనే విషవలయంలో సామాన్యుడు చిక్కుకుపోతాడు. రష్యాపై ఆంక్షలు విధిస్తే అది ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తుంది, పశ్చిమ ఆసియాలో యుద్ధం వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఊహించని స్థాయికి చేరుతాయి. ఈ ప్రభావంవల్ల పాలు, గుడ్లు, మాంసం వంటి ప్రతి ప్రోటీన్ ఆధారిత ఆహారం ధర పెరుగుతుంది ఎందుకంటే పశుగ్రాసం రవాణా కూడా ఖరీదైనదిగా మారుతుంది. యుద్ధంఅంటే కేవలం ప్రాణ నష్టం మాత్రమేకాదు, జీవన ప్రమాణాల విధ్వంసంకూడా. ఇది ఒక దేశపు ఆర్థిక వ్యవస్థను దశాబ్దాల వెనక్కి నెట్టే స్తుంది. శాంతి లేని లోకంలో ఆహార భద్రత ఉండదు. సామాన్యుడి పళ్లెంలో యుద్ధం చిమ్ముతున్న విషం ధరల పెరుగుదల రూపంలో వస్తోంది. మానవాళి తన స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటాల్లో చివరకు బల య్యేది పేదవాడి ఆకలి మాత్రమేనని మనం గుర్తించాలి. అంతర్జాతీయంగా డిజిటల్ కరెన్సీలు, క్రిప్టోలు ఎన్ని వచ్చి నా, యుద్ధం వస్తే బంగారం, చమురు, ఆహారం మాత్రమే అసలైన ఆయుధాలుగా మారుతాయి. సామాన్యుడు ఈ పరిస్థితులను తట్టుకోవాలంటే పొదుపు మంత్రం ఒక్కటే సరిపోదు, ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను స్థానిక ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యుద్ధం కొనసాగితే గ్లోబలైజేషన్ పతనం ప్రారం భమై, ప్రతి దేశం తన సొంత అవసరాల కోసం సరిహద్దు లను మూసివేసే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచవ్యాప్త ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి సామాన్యుడి పళ్లెంపై యుద్ధ ప్రభావం అనేది ఒక మౌనమైన సునామీ లాంటిది. అది నెమ్మదిగా మన వంటగదిలోకి ప్రవేశించి మన కడుపు మాడ్చే అవకాశాలున్నాయి.
-డా. చిట్యాల రవీందర్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

