Dailyhunt
పెట్రోల్ సంక్షోభంలో పాకిస్థాన్ .. లీటర్ ధర ఎంతంటే..

పెట్రోల్ సంక్షోభంలో పాకిస్థాన్ .. లీటర్ ధర ఎంతంటే..

వార్త 2 weeks ago

న దగ్గర పెట్రోల్ ధరలు (Petrol prices) రూపాయి, రెండు రూపాయలు పెరిగితేనే అబ్బా.. దారుణం అని ఫీలవుతుంటాం. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్‌ (Pakistan) లో పరిస్థితి చూస్తే..

మనం చాలానయం అనిపిస్తుంది. గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ దెబ్బకు పాకిస్థాన్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా నిర్ణయం తీసుకుంది. నెల రోజులు తిరగకముందే రెండోసారి ధరలను పెంచుతూ షాక్ ఇచ్చింది. తాజా పెంపుతో అక్కడ డీజిల్ ధర ఏకంగా 55 శాతం, పెట్రోల్ ధర 42 శాతం పెరిగిపోయాయి. రేట్లు చూస్తే కళ్లు తిరగడం ఖాయం! పాకిస్థాన్ పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ ప్రకటించిన వివరాల ప్రకారం.. అక్కడ లీటర్ డీజిల్ ధర ఇప్పుడు 520.35 పాకిస్థానీ రూపాయలకు చేరింది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే లీటర్ ధర 458.40 రూపాయలకు ఎగబాకింది. అంటే ఒక లీటర్ పెట్రోల్ కొట్టించాలంటే అక్కడ ఒక మధ్యతరగతి వ్యక్తి తన రోజువారీ సంపాదనలో సగానికి పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు నియంత్రణ కోల్పోవడం, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం దీనికి ప్రధాన కారణమని పాక్ ప్రభుత్వం సాకులు చెబుతోంది.

Read Also: Attack on Tehran Karaj Bridge: టెహ్రాన్-కారజ్ వంతెనపై వైమానిక దాడులు.. ఇద్దరు మృతి

 Petrol prices

Petrol prices: 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..

భారత్‌తో పోలిస్తే.. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మన ఇండియాలో పెట్రోల్ ధరలు (Petrol prices) ప్రస్తుతం లీటర్ రూ. 100 నుంచి రూ. 110 మధ్యలో (రాష్ట్రాలను బట్టి) ఊగిసలాడుతున్నాయి. పాకిస్థాన్ ధరలతో పోలిస్తే మనది చాలా రీజనబుల్ అనిపిస్తోంది కదా? అక్కడ లీటర్ ధర రూ. 450 అంటే.. మన దగ్గర ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించే పైసలతో అక్కడ కేవలం నాలుగైదు లీటర్లు మాత్రమే వస్తాయన్నమాట! ఉపశమనం కోసం పాక్ సర్కార్ తిప్పలు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడి, పాక్ ప్రభుత్వం కొన్ని ‘బిస్కెట్’ లాంటి ఆఫర్లు ప్రకటించింది. టూ వీలర్ వాడేవారికి నెలకు 20 లీటర్ల వరకు, లీటరుకు రూ. 100 సబ్సిడీ ఇస్తారట. ఇది వినడానికి బాగున్నా, పెరిగిన రేట్లతో పోలిస్తే ఇది సముద్రంలో కాకమ్మ చుక్క లాంటిదే. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడానికి ఎకరాకు రూ. 1,500 ఇస్తామని ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ చెప్పారు. అయితే ఇవన్నీ ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎంతవరకు తగ్గిస్తాయో చూడాలి. అక్కడ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు పెరిగిన ధరల ముందు ఏమాత్రం సరిపోవడం లేదు. మన దేశంలో పెట్రోల్ ధరలు (Petrol prices) కొంత భారంగా అనిపించినా, పొరుగు దేశంలోని దారుణమైన రేట్లతో పోలిస్తే మనం చాలా నయం అనిపిస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్: 'భారత్ రియాక్షన్ ఊహించలేరు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha