Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆకాశానికి చికెన్ ధరలు.. జూన్ వరకు ఇంతేనా? కారణాలివే!

ఆకాశానికి చికెన్ ధరలు.. జూన్ వరకు ఇంతేనా? కారణాలివే!

వార్త 1 week ago

Chicken rates today: ప్రస్తుతం చికెన్ ప్రియులకు షాక్ తగిలేలా ధరలు పెరిగాయి. వారం క్రితం వరకు సాధారణంగా ఉన్న రేట్లు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో 280 రూపాయలు ఉన్న కిలో స్కిన్‌లెస్ చికెన్ ఇప్పుడు ఏకంగా 330 రూపాయల మార్కును దాటేసింది. మటన్ కూడా కిలో వెయ్యి రూపాయలకు పైగా పలుకుతోంది.

Read also: Stock market: లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

 Chicken rates hiked in local markets

Chicken rates today: ధరలు పెరగడానికి అసలు కారణాలు

తీవ్రమైన ఎండలు, కోళ్ల ఉత్పత్తి తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఎండ తీవ్రత వల్ల ఫారాల్లో కోళ్లు చనిపోవడంతో మార్కెట్లోకి సరఫరా బాగా తగ్గింది. దీనికి తోడు శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం జూన్ చివరి వరకు ఇలాగే ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుత మార్కెట్ ధరల వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో లైవ్ బర్డ్ ధర 210 రూపాయల వరకు ఉంది. స్కిన్‌తో ఉన్న చికెన్ 220 రూపాయలు కాగా, స్కిన్‌లెస్ రేటు 330 రూపాయలకు చేరింది. ఎముకలు లేని బోన్‌లెస్ చికెన్ అయితే ఏకంగా 660 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. గుడ్ల ధర కూడా డజను 80 రూపాయలకు చేరి వినియోగదారులపై అదనపు భారం వేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భారీగా పెరగనున్న కూరగాయలు, పప్పుల ధరలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha