Poverty : పెట్టుబడిదారీ వ్యవస్థ పేదలను. ధనికులను సృష్టిస్తుం ది. కష్టజీవులు, కార్మికులు ఉత్పత్తుల ద్వారా సంవ దలు సృష్టించినా దానిపై హక్కు లేక పేదరికంలో మగ్గుతు న్నారు.
ఏ కష్టం చేయని వారు సంపన్నులు అయ్యారు. పెట్టుబడిదారులుగా మారిన వీరు అనేక దేశాల్లో పారిశ్రా మిక రంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. వెనుకబడిన దేశాల్లో సేద్యం చేయని భూకామందుల వద్ద భూమి పోగు బడి ఉంది. సేద్యం చేసే గ్రామీణ పేదలు భూమికి దూరం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజల మధ్య ఆర్ధిక వ్యత్యా సాలు తీవ్రమైనాయి. పెట్టు బడిదారీ వ్యవస్థ సృష్టించిన ఆర్ధిక వ్యత్యాసాల వల్ల మొత్తం ప్రపంచ సంపదలో 10 శాతం కుబేరుల వద్ద 75శాతం సంపద ఉంటే, 90 శాతం ప్రజల వద్ద 25శాతం సంపద మాత్రమే ఉంది. అత్యంత ధనవంతులైన 1శాతం కుబేరుల వద్ద37శాతం పైగాసంపద పోగుబడి ఉంది. ప్రపంచంలో 100 బిలియన్ల అమెరికా డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వారి సంఖ్య 15 శాతానికి చేరింది. ఎలన్మర్క్ 936 బిలియన్ యుఎస్ డాలర్లు, లారీఫేజ్ 299 బిలియన్ డాలర్లు, సెర్గీబ్రిన్ 275 బిలియన్ డాలర్లు, మైఖేల్డిల్ 229 బిలియన్ డాలర్లు, జెఫ్బె జోస్ 225 బిలియన్ డాలర్లతో ప్రపంచటాప్ ఐదుగురు కుబేరులుగా ఉన్నారు.
poverty
poverty : ఆర్థిక అసమానత
భారతదేశంలో అత్యధిక ఆర్థిక అస, మానతలు ఉన్నట్లు, ప్రపంచ అసమానతల నివేదిక తెలిపింది. టాప్ 10శాతం కుబేరుల వద్ద దేశం మొత్తం సంప దలో 65 శాతం ఉండగా, వీరిలో ఒకశాతం అత్యంత కుబే రుల వద్ద ఏకంగా 40శాతం సంపద ఉంది. దిగువ 50 శాతం ప్రజల వద్ద కేవలం 15శాతం సంపద ఉంది. పెట్టు బడిదారీ విధానాల ఫలితంగా ప్రపంచంలో ఆర్థిక అసమాన తలతో పాటు సంపద కొద్ది మంది వద్ద పోగుబడి ఉండటం వల్ల ప్రపంచంలో పేదరికం తీవ్రంగా ఉంది. ప్రపంచజనాభా లోని 70కోట్లకు పైగా ప్రజలు అంతర్జాతీయ దారిద్య్రరేఖ ప్రకారం తీవ్ర పేదరికంలో ఉన్నారు. రోజుకి మూడు అమెరికా డాలర్లు, భారతీయ కరెన్సీలో 250 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని తీవ్ర పేదరికంలో ఉన్నవారిగా అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ పరిగణిస్తున్నాయి. సబ్సహరా ఆఫ్రికా ప్రాంతం అత్యంత పేద ప్రాంతం. అక్కడ సుమారు 4కోట్ల, 30 లక్షల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు.
90 లక్షల మంది ప్రజలు ఆకలితో మరణిస్తున్నారు
భారత దేశం పేద జనాభా సంఖ్యరీత్యా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. దేశంలో 23.4 కోట్ల మంది తీవ్ర పేదరికంలో మగ్గు తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజు వారి ఆదాయం మూడు డాలర్లకన్నా తక్కువ ఉన్నవారిని ప్రామాణికంగా తీసుకుంటే, భారతదేశంలో తీవ్రపేదరికంలో ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉం టుంది. దేశం రోజు మూడు డాలర్ల ఆదాయం అత్యధిక ప్రజలకు లభించకపోవడమే అందుకు కారణం. భారతదేశం లో, పాకిస్థాన్, ఇథియోపియా, నైజీరియా దేశాలకన్నా పేద లు ఎక్కువగా ఉన్నారు. సంపద వ్యత్యాసాల వల్ల ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఆకలితో అలమటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 90 లక్షల మంది ప్రజలు ఆకలితో మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, వివిధ అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఈ గణాంకాలు నమోదు అయ్యాయి. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా 25 వేల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారు. యుద్ధాలు, అంతర్గత కలహాలు నడుస్తున్న దేశాల్లోనే ఆకలి వల్ల వేలాది మంది చనిపోతూన్నారని ఆక్స్భాం నివేదిక పేర్కొంది. ఆకలి మర ణాలలో మూడింట ఒకవంతు (30లక్షల మంది ) 5 సంవ త్సరాలలోపు ఉన్న చిన్న పిల్లలే ఉంటున్నారు. తీవ్ర ఆహార లోపం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి క్షీణించి, సాధారణ వ్యాధులు కూడా ప్రాణాంతకం అవుతున్నాయి.
ఆకలి రహిత ప్రపంచం
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 73.3కోట్లమంది ప్రతిరోజు రాత్రిపూట ఆకలితో నిద్రపోతున్నారు. సూడాన్, పాలస్తీనా(గాజా) దక్షిణ సూడాన్, హైతీ, మాలి వంటి దేశాల్లో కరవు పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. 2030 నాటికి ఆకలి రహిత ప్రపంచం అనే ఐక్యరాజ్యసమితి లక్ష్యం నెరవేరేవరి స్థితి కనుచూపు మేర కల్పించడంలేదు. భారతదేశంలో తాజా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా సర్వేచేసిన123 దేశాల్లో, భారతదేశం ఆకలిసూచిలో 102వ స్థానంలోఉంది. మన దేశానికి లభించిన 25. 8స్కోర్తో ఆకలి పోషకాహార లోపం తీవ్రతను తీవ్రమైనదిగా వర్గీకరించారు. దేశ జనాభా లో అవసరమైన క్యాలరీల ఆహారం లభించని వారు 12 శాతంగా ఉన్నారు. 5 ఏళ్లలోపు పిల్లల్లో వయస్సుకు తగ్గ ఎత్తులేని పిల్లలు32.9శాతంగా ఉన్నారు. ప్రతి ముగ్గురులో ఒకరు ఎత్తుకు తగ్గ బరువు లేరు. తీవ్రపోషకాహార లోపం ఉన్నపిల్లలు 18.7శాతం ఉన్నారు. ఎన్ఎఫెచ్ఎస్ నివేదిక ప్రకారం దేశంలో 50 మంది గర్భిణీలుస్త్రీలు, కౌమార బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐక్య రాజ్యసమితి నివేదిక ప్రకారం భారతదేశంలో తీవ్ర పోషకాహార లోపం వల్ల 5సంవత్సరాలలోపు పిల్లలు ఏటామూడు లక్షలకుపైగా చని పోతున్నారు.
poverty
భూస్వామ్య వ్యవస్థలే కారణం
భారతదేశంలో ప్రత్యక్షంగా ఆకలిలేక అన్నం లేక చనిపోయిన వారి మరణాలు నమోదు కాలేదని, దేశం లో ఆకలి చావులు లేవని కేంద్రప్రభుత్వం చెబుతున్నది. కాని అంతర్జాతీయ సంస్థలు (యునిసెఫ్, ఎఫ్ఎ) వివిధ స్వచ్ఛంద సంస్థల పరిశోధనల ప్రకారం తీవ్రమైన పోషకా హార లోపం వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల వల్ల భారత్లో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. భారత దేశంలో జరిగే ఆకలి మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పి పుచ్చుతున్నాయని అనేక మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. ఒకవ్యక్తి ఆకలితో మరణించినప్పుడు, పోస్టాస్ట్రమ్ నివేదికలో మరణానికి గల కారణాన్ని పోషకాహార లోపంతో వచ్చిన గుండె వైఫల్యం లేదా అతి సారవ్యాధి అని రాస్తారే తప్ప నేరుగా ఆకలిచావు అని నమోదు చేయరని రైట్టుఫుడ్ క్యాంపియన్ వంటి సంస్థలు చెబుతున్నాయి. భారతదేశంలో జరుగుతున్న ఆకలిచావులను ఈ నేపథ్యంలో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా పేదరికానికి, ఆకలి మరణాలకు పెట్టుబడి దారీ, భూస్వామ్య వ్యవస్థలే కారణం. ఈ వ్యవస్థల స్థానం లో నూతన ప్రజాతంత్ర వ్యవస్థులు, సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడినప్పుడే పేదరికం తొలిగి ఆకలిమరణాలు ఆగుతాయి. అందుకు వెనుకబడిన దేశాల, పెట్టుబడి దారీ దేశాల ప్రజలు నేటివ్యవస్థల మార్పు కోసం ఉద్యమించాలి.
-బొల్లిముంత సాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
ఏం కొనేటట్టు లేదు.. తెలంగాణలో పెరిగిన బియ్యం, చికెన్, గుడ్ల ధరలు!

