Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆలా పిలిపించుకోవడం ఇష్టం - కవిత

ఆలా పిలిపించుకోవడం ఇష్టం - కవిత

వార్త 1 week ago

తెలంగాణ సమాజంతో తనకున్న బంధంపై TRS అధినేత కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ తనను 'అమ్మ' అని పిలిపించుకోవడమే తనకు ఎంతో ఇష్టమని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

ప్రతిష్టాత్మక ‘వే2న్యూస్ కాంక్లేవ్ 2026’ (Way2News Conclave) వేదికగా శనివారం జరిగిన ముఖాముఖి చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయం నుండి రాష్ట్ర ప్రజలు తనను ప్రేమగా ‘అక్క’ అని పిలుచుకునేవారని గుర్తుచేసిన ఆమె, ఇప్పుడు ఆ పిలుపు స్థానంలో ‘అమ్మ’ అనే మాతృత్వపు బాధ్యతను ఆశిస్తున్నట్లు తెలపడం రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.

Read Also : ఏ క్షణమైనా బండి భగీరథ్ ను అరెస్ట్ చేయొచ్చు !!

అక్కకు, అమ్మకు ఉన్న వ్యత్యాసం అదే

తన తాజా వ్యాఖ్యల వెనుక ఉన్న బలమైన సామాజిక, భావోద్వేగ కారణాలను కవిత ఈ వేదికపై సుదీర్ఘంగా వివరించారు. “ఒక కుటుంబంలో సోదరి (అక్క) బాధ్యత అనేది కొంత పరిమితి వరకే ఉంటుంది. కానీ ఒక తల్లి అలా కాదు.. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి, రాత్రింబగళ్లు కుటుంబం శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తుంది” అని కవిత వ్యాఖ్యానించారు. ఒక తల్లికి తన పిల్లల పట్ల ఎలాంటి బాధ్యత, ప్రేమ ఉంటాయో.. తెలంగాణ ప్రజలపై తనకు అలాంటి మాతృత్వపు భావన ఉందని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ నాయకురాలిగా కాకుండా, ఒక తల్లి స్థానంలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలనేదే తన ఆరాటమని ఆమె పేర్కొన్నారు.

నా సొంత ఇల్లే తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని తన సొంత కుటుంబంతో పోల్చిన కవిత.. భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో మరింత చురుగ్గా పనిచేస్తానని ప్రకటించారు. “రేపు నా సొంత ఇంట్లో ఏదైనా సమస్య లేదా ఇబ్బంది వస్తే ఒక తల్లిగా నేను ఎలాగైతే తల్లడిల్లిపోతానో, ఎలాగైతే తక్షణమే రియాక్ట్ అవుతానో.. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల ఏ ఒక్క పౌరుడికి ఇబ్బంది వచ్చినా నేను అదే విధంగా స్పందిస్తాను” అని కవిత స్పష్టం చేశారు. ఇటీవల ఎదుర్కొన్న రాజకీయ, వ్యక్తిగత ఒడిదొడుకుల అనంతరం కవిత నుంచి వచ్చిన ఈ భావోద్వేగ ప్రకటన, ఆమె ప్రజా బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha