Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెగిపడ్డ అపార్ట్‌మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!

తెగిపడ్డ అపార్ట్‌మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నేతలకు గాయాలు!

వార్త 1 week ago

Hyderabad Lift Collapse Accident: హైదరాబాద్‌లో, ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిపోవడంతో ఆరుగురు బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.

మణికొండ సమీపంలోని డాలర్ హిల్స్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.రాజేంద్రనగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కార్తీక్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర ప్రణాళికలపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు డాలర్ హిల్స్‌లోని సదరు అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తుకు వచ్చారు.

Read Also:Nampally Train Fire Accident: జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Hyderabad Lift Collapse Accident: ఇద్దరి పరిస్థితి విషమం.. అపోలోకు తరలింపు

సమావేశం, ముగిసిన అనంతరం నాయకులంతా కలిసి తిరిగి కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే, లిఫ్ట్ కిందికి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. లిఫ్ట్ కేబుల్ వైర్లు ఒక్కసారిగా తెగిపోవడంతో 5వ అంతస్తు ఎత్తు నుంచి లిఫ్ట్ నేరుగా కింద పడిపోయింది.ఈ ప్రమాదంలో లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు నేతలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు నాయకులు అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు వారిద్దరి కాళ్లు విరిగినట్లు సమాచారం.

 Hyderabad Lift Accident BRS Leaders

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక అపార్ట్‌మెంట్ యాజమాన్యం లిఫ్ట్ నిర్వహణను నిర్లక్ష్యం చేయడం వల్ల వైర్లు తెగాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఊహించని ప్రమాదంతో సదరు అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha