Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఆల్ఫా'గా అలియా భట్ యాక్షన్ విధ్వంసం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ప్రోమో అవుట్!

'ఆల్ఫా'గా అలియా భట్ యాక్షన్ విధ్వంసం.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ప్రోమో అవుట్!

వార్త 4 days ago

Alia Bhatt Alpha Movie Teaser: బాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త హై-వోల్టేజ్ యాక్షన్ అవతార్‌తో అభిమానులను షాక్‌కు గురిచేశారు.

భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాక్షన్ ఫ్రాంచైజీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ నుండి రాబోతున్న మొదటి ఫిమేల్ లీడ్ ఓరియంటెడ్ స్పై ఫిల్మ్ ‘ఆల్ఫా’ (ALPHA). ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ ప్రోమో/టీజర్‌ను బుధవారం (జూన్ 10, 2026) నాడు మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఇందులో అలియా భట్ చేసిన రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.

Read also:Nandamuri Balakrishna Birthday: బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బ్రాహ్మణి

తోడేలు కూతురు తోడేలే అవుతుంది - ప్రోమో హైలైట్స్

విడుదలైన ప్రోమో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. బలమైన ఎమోషన్, ఉత్కంఠభరితమైన డైలాగ్స్‌తో సాగింది. ప్రోమో ప్రారంభంలో అలియా భట్ తన 18వ పుట్టినరోజు వేడుకలను తండ్రి (బాబీ డియోల్) తో జరుపుకుంటున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఆ సంతోషం వెనుక ఒక ప్రమాదకరమైన సీక్రెట్ దాగి ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుండి తీసుకున్న కఠినమైన శిక్షణ కేవలం బతకడానికి కాదు.. తన 18వ పుట్టినరోజునే మొదటి అండర్ కవర్ మిషన్‌కు సిద్ధం కావడానికని తండ్రి పాత్ర రివీల్ చేస్తుంది. ఈ ప్రోమోలో విలక్షణ నటుడు బాబీ డియోల్ చెప్పిన ఒక్క డైలాగ్ సినిమాపై హైప్ పెంచేసింది. “ఈ ప్రపంచంలో తోడేళ్లు, గొర్రెలు మాత్రమే ఉంటాయి. తోడేలు కూతురు తోడేలే అవుతుంది” అంటూ భారతదేశపు తదుపరి తరం ఎలైట్ సైనికులను తయారు చేసే రహస్య ‘ఆల్ఫా’ ప్రోగ్రామ్‌ను కూతురికి పరిచయం చేస్తాడు. ఆ తర్వాత వచ్చే సీన్లలో అలియా భట్ ప్రత్యర్థులపై పంచ్‌లు విసరడం, గాల్లోకి లేచి కాలితో తన్నడం వంటి రోమాంచిత పోరాట సన్నివేశాల్లో మెరిశారు. చివర్లో ఆమెను ‘మన ఏకైక ఆల్ఫా’ అని ప్రకటించడంతో ప్రోమో ముగుస్తుంది. ఈ ప్రోమోను షేర్ చేస్తూ వైఆర్ఎఫ్ సంస్థ.. “మొదటిది, వేగవంతమైనది, ధైర్యమైనది. #ALPHA” అని క్యాప్షన్ ఇచ్చింది.

Alia Bhatt Alpha Movie Teaser: శర్వరీ వాఘ్ పాత్రపై సస్పెన్స్ - పెరిగిన అంచనాలు

‘రాజీ’, ‘గంగూబాయి కతియావాడి’, ‘హైవే’ వంటి సినిమాలతో నటిగా జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న అలియా భట్.. ఒక పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ రోల్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో అలియా భట్‌తో పాటు మరో యంగ్ క్రేజీ హీరోయిన్ శర్వరీ వాఘ్ (Sharvari Wagh) కూడా లేడీ స్పై ఏజెంట్‌గా నటిస్తోంది. అయితే, ఈ తాజా ప్రోమోలో కేవలం అలియా, బాబీ డియోల్ లీడ్‌ను మాత్రమే చూపించి, శర్వరీ వాఘ్ లుక్ లేదా ఆమె పాత్ర వివరాలను మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచడం గమనార్హం.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha