Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బ్రాహ్మణి

బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్, బ్రాహ్మణి

వార్త 4 days ago

Nandamuri Balakrishna Birthday: నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా ఆయన అల్లుడు, మంత్రి నారా లోకేశ్ అలాగే కుమార్తె నారా బ్రాహ్మణి తమ ప్రియతమ తండ్రికి, మావయ్యకు ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్ట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read Also : The Empty Address movie: 'ది ఎంప్టీ అడ్రస్' మూవీతో షఫీక్ ఉర్ రెహమాన్ హాలీవుడ్ ఎంట్రీ

Nandamuri Balakrishna Birthday: 'గాడ్ ఆఫ్ మాసెస్' కు లోకేశ్ అభినందనలు

"నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలకృష్ణను అభిమానుల పాలిట 'గాడ్ ఆఫ్ మాసెస్' అని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచే 'ఆపన్న హస్తం' అని ఆయన కొనియాడారు. హిందూపురం ప్రజా విజేత అయిన బాలకృష్ణ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

నాన్నే నా సూపర్ హీరో: నారా బ్రాహ్మణి

మరోవైపు బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి తన తండ్రిని రియల్ సూపర్ హీరోగా అభివర్ణిస్తూ ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న! చిన్నప్పుడు నేను సూపర్ హీరో కోసం ఎక్కడో వెతకలేదు, మిమ్మల్ని చూస్తే చాలు అనిపించేది. మీకున్న అభిరుచి, పట్టుదలే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో తీర్చిదిద్దాయి. నాకు ప్రతి విషయంలో అండగా, గురువుగా, గొప్ప స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. మీ కుమార్తెగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం" అని బ్రాహ్మణి తన పోస్టులో ఎంతో ప్రేమగా రాసుకొచ్చారు. రాబోయే ఏడాది మొత్తం ఆయన మంచి ఆరోగ్యం, సంతోషంతో గడపాలని ఆమె ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha