Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి?.. జూలై 5న పెళ్లి వార్తలు

ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి?.. జూలై 5న పెళ్లి వార్తలు

వార్త 1 week ago

Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జూలై 5న ఈ వివాహం జరగనున్నట్లు ఆమిర్‌కు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.

జూలై 5న పెళ్లి జరిగే అవకాశం

ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ తమ సంబంధాన్ని అధికారికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే సాధారణ రిజిస్టర్డ్ వివాహం చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమ కోసం ప్రత్యేకంగా గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించే ఆలోచన లేదని ప్రచారం జరుగుతోంది.

25 ఏళ్ల స్నేహం ప్రేమగా మారింది

గౌరీ స్ప్రాట్‌కు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఆమెకు ఆమిర్ ఖాన్‌తో దాదాపు 25 సంవత్సరాలుగా స్నేహం ఉందని సమాచారం. అయితే కొంతకాలం క్రితమే వారి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. గత ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆమిర్ మీడియాకు గౌరీని పరిచయం చేశారు.

Read also: Dance Master Pandu Accident: పండు మాస్టర్ కాళ్లకు ఆపరేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు!

 Aamir Khan

ఆమిర్ వ్యక్తిగత జీవితం

ఆమిర్ ఖాన్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరు విడిపోయారు. అనంతరం 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్న ఆమిర్‌కు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. 2021లో ఆమిర్, కిరణ్ కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఫ్యామిలీతో ముఖ్యమంత్రి విజయ్‌ కలిసిన నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha