Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫ్యామిలీతో ముఖ్యమంత్రి విజయ్‌ కలిసిన నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

ఫ్యామిలీతో ముఖ్యమంత్రి విజయ్‌ కలిసిన నటి ఖుష్బూ.. ఎందుకో తెలుసా?

వార్త 2 weeks ago

Khushbu Meets CM Vijay: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన, ప్రాధాన్యత కలిగిన భేటీ చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్..

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ స్టార్ హీరో విజయ్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన చిన్న కుమార్తె వివాహ వేడుకకు సంబంధించిన లగ్న పత్రికను విజయ్‌కు ఖుష్బూ స్వయంగా అందజేసి, పెళ్లికి ఆహ్వానించారు.

Read also: Dance Master Pandu Accident: పండు మాస్టర్ కాళ్లకు ఆపరేషన్ తప్పనిసరి అంటున్న వైద్యులు!

 Actress Khushboo met Chief Minister Vijay with his family.. Do you know why?

Khushbu Meets CM Vijay: భర్త, కుమార్తెలతో కలిసి వెళ్లిన ఖుష్బూ

తన భర్త సుందర్ సి, కుమార్తెలతో కలిసి ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన ఖుష్బూ.. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్‌ను ‘సోదరుడు’ అని సంబోధిస్తూ ఆమె ఒక సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్‌ను పెట్టారు. ఈ రోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. మా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను ఆయన నివాసంలో కలిసి మా చిన్న కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్ ల వివాహానికి సాదరంగా ఆహ్వానించాం అని ఖుష్బూ పేర్కొన్నారు.

నా కుమార్తెలు ఎంతో థ్రిల్ అయ్యారు

సీఎం విజయ్‌తో జరిగిన ఈ ముఖాముఖి భేటీపై ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు. విజయ్‌ను కలవడం ఎప్పుడూ అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా నా కుమార్తెలు ఆయనను కలవడంతో ఎంతో థ్రిల్ అయ్యారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించారు. తన బిజీ షెడ్యూల్‌లోనూ మాకు సమయం కేటాయించి, ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో మమ్మల్ని స్వాగతించారు. ఎప్పటిలాగే తనదైన చిరునవ్వుతో పలకరించారు. ఆయన మా కుటుంబానికి అందించిన దీవెనలు, ప్రేమ ఎంతో అమూల్యమైనవి. ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఖుష్బూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేదా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha