Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' నుంచి మెలోడీ పాట విడుదల

ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' నుంచి మెలోడీ పాట విడుదల

వార్త 2 weeks ago

EPIC Priyasakhi Song: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త లవ్ ఎంటర్‌టైనర్ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. సూపర్ హిట్ '90s వెబ్ సిరీస్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కాంబినేషన్ పరంగానే కాకుండా, వెరైటీ టైటిల్‌తోనే యూత్‌లో భారీ క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'ప్రియసఖి' లిరికల్ పాట విడుదల చేశారు. ప్రముఖ ఆడియో సంస్థ 'ఆదిత్య మ్యూజిక్' ద్వారా ఈ సాంగ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది.

Read Also : Maa Inti Bangaram Trailer:అమాయకపు కోడలిగా, అండర్‌వరల్డ్ డాన్‌గా సమంత విశ్వరూపం!

 Melody song from Anand Deverakonda’s ‘Epic First Semester’ released

EPIC Priyasakhi Song: మనసును తాకే అందమైన ప్రేమ గీతం

'ప్రియసఖి' సాంగ్ పూర్తిగా మెలోడియస్ గా, వినగానే లూప్‌లో పెట్టుకుని వినేలా ఉంది. సరికొత్తగా ప్రేమలో పడిన ఒక సగటు యువకుడి మనోభావాలను, అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించిన తర్వాత కలిగిన మధురమైన మార్పులను ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. పాటలోని లిరిక్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా:

"సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెలిది.. భూమికి తెలియని మట్టి వాసనిది ఏమిది ఏమిది" అనే లైన్లు, అలాగే.. "జీవితాన్ని మార్చేసావే బుజ్జి నెమలి.. స్వర్గంలోతూ చూపించవే పూలకడలి" అంటూ హీరో తన ప్రేయసిని వర్ణించే విధానం నేటి తరం యువతకు పెర్‌ఫెక్ట్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంది.

క్రేజీ కాంబో.. అంచనాలు భారీ!

'బేబీ' సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కెమిస్ట్రీ, ఎమోషనల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ నెలకొంది. దీనికి తోడు క్లీన్ అండ్ ఎమోషనల్ కంటెంట్, ఎమోషన్స్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలోనూ గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫస్ట్ సింగిల్ విడుదలతో సినిమాపై అంచనాలు మరో మెట్టు ఎక్కాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సమంత నటన నెక్స్ట్ లెవెల్.. 'మా ఇంటి బంగారం'పై నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha